'మజిలీ'తో మొదలైన సమ్మర్ సినిమాల సందడి వరుసగా కొనసాగుతోంది. 'మజిలీ' మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన 'చిత్రలహరి'కీ పోటిజివ్ టాక్ వచ్చింది. లేటెస్ట్‌గా విడుదలైన 'జెర్సీ' కూడా దూసుకెళ్తోంది. ఈ మూడు సినిమాల కాన్సెప్ట్ సీకింగ్ సక్సెస్సే. 'మజిలీ', 'జెర్సీ' సినిమాలైతే క్రికెట్ నేథ్యంలో రూపొందినవి. రెండింట్లోనూ ఎమోషనల్ టచ్ బాగా ఉంది.
ఎప్పుడూ ఎంటర్‌టైన్‌మెంటే కాదు, అప్పుడప్పుడూ ఎమోషన్‌కి కూడా ఆడియన్స్ కనెక్ట్ అవుతారని చెప్పడానికి ఈ సమ్మర్ సినిమాలే బెస్ట్ ఎగ్జాంపుల్. ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు ఈ సినిమాలకు. ఐపీఎల్ సీజన్ కొనసాగుతున్న ఈ తరుణంలో సీజన్ బాగా కలిసొచ్చింది ఈ సినిమాలకు. మామూలుగా అయితే ఒక సినిమా సక్సెస్ ఇంకో సినిమాని దెబ్బ తీస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు, క్రికెట్ నేపథ్యంతో రూపొందిన 'మజిలీ', 'జెర్సీ' సినిమాలకు అదనంగా మధ్యలో వచ్చిన 'చిత్రలహరి' ఇంకా బాగా కలిసొచ్చింది.
మూడూ సాఫ్ట్ సినిమాలే. కథా, కథనాలు ఎమోషనల్‌గా ఉన్నాయి. ఎమోషన్ ఒక్కటే అయినా వేరియేషన్ చూపించడంతో మళ్లీ మళ్లీ చూసేందుకు ఆడియన్స్ ఎట్రాక్ట్ అవుతున్నారు. దాంతో ఏ సినిమా వసూళ్లకీ దెబ్బ పడడం లేదు. గత వారం విడుదలైన సాయి ధరమ్ తేజ్ 'చిత్రలహరి' నిన్న 'జెర్సీ' ఓపెనింగ్స్‌తో కాస్త డల్ అయినట్లు కనిపించినా ఈ రోజు మళ్లీ పుంజుకుంది. 'మజిలీ' ఫ్యాన్స్ 'మజిలీ'కే ఉన్నారు. సో ఈ మూడు సినిమాలతోనూ బాక్సాఫీస్ బాగానే కళకళలాడుతోంది.