ఓ వయసొచ్చాక హీరోయిన్‌గా కొనసాగడం కష్టమే. అయితే ఆ 'ఒక వయసు' అనేది ఇప్పుడు మారిపోయింది. వయసుతో సంబంధం లేకుండా హీరోయిన్‌గా కొనసాగుతున్నారిప్పుడు అందాల భామలు. సమంత విషయానికొస్తే, పెళ్లయ్యాక ఆమె కెరీర్‌లో స్పీడు చాలా పెరిగింది. ఇదే విషయమై సమంతను ప్రశ్నిస్తే, ఆశక్తికరమైన సమాధానం చెప్పింది.
అన్ని సందర్భాల్లోనూ ఎంచుకున్న సినిమాలు విజయల్నివ్వకపోవచ్చు. కానీ కొత్తదనం కోసం పరితపిస్తే, ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుందని చెప్పింది. నిజమే ఇటీవల కాలంలో సమంత రొటీన్ సినిమాల్ని ఎంచుకున్నది లేదు. 'రంగస్థలం', యూటర్న్'.. ఇలా ఏది చూసినా ప్రత్యేకమే. ఈ సమ్మర్‌లో మూడు సినిమాలు రాబోతున్నాయి సమంత నుండి.
ఒకదాన్ని మించి ఇంకోటి ప్రత్యేకమైన సినిమాలే. 'నా లిమిట్స్ నాకు తెలుసు.. పలానా పాత్రలే చేయాలి అని అనుకోను కానీ, వచ్చిన పాత్రల్లోంచి బెస్ట్ ఏంటనేది ఎంచుకోగలను.. అయితే అవి కూడా కొన్నిసార్లు తేడా కొట్టొచ్చు. నా విషయంలో ఎంచుకున్న ప్రతీ కొత్త పాత్ర మంచి పేరు తెచ్చిపెడుతోంది. అందుకే ప్రయోగాల్ని ఇంకా ఇష్టంగా చేయగలుగుతున్నానని సమంత చెప్పింది. 'మజిలీ', 'ఓ బేబీ..', సూపర్ డీలక్స్' సినిమాలు ఈ వేసవిలో సమంత నుండి రాబోతున్నాయి.