బన్నీ మూడో హీరోయిన్‌ ఎవరో తెలుసా.?

మరిన్ని వార్తలు

స్టైలిష్‌ స్టార్‌ బన్నీ లేటెస్ట్‌గా కొత్త సినిమాని ప్రారంభించారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ఇది. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది. కాగా బన్నీ ఇది కాక మరో రెండు ప్రాజెక్టులు అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి సుకుమార్‌తో చేయాల్సి ఉంది. ఈ సినిమాలో బన్నీతో జత కట్టబోయే ముద్దుగుమ్మ పేరు దాదాపు ఖరారైపోయినట్లే. ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు క్రేజీ బ్యూటీ కన్నడ భామ రష్మికా మండన్నా. 

 

ఇక ముచ్చటగా మూడో సినిమా 'ఐకాన్‌'. యంగ్‌ డైరెక్టర్‌ వేణు శ్రీరామ్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌ కోసం అప్పుడే వేట మొదలెట్టేశారట. అయితే ఈ సారి బన్నీ బాలీవుడ్‌పై కన్నేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌ క్రేజీ భామల పేర్లను ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నాడట బన్నీ. ఈ సారి ఎలాగైనా బాలీవుడ్‌ నుండే హీరోయిన్‌ని దించాలని భావిస్తున్నాడట. దిల్‌ రాజు బ్యానర్‌లో ఈ సినిమా రూపొందనుంది. సో బడ్జెట్‌ విషయంలో ఎలాంటి ఢోకా లేదు. 

 

ఇకపోతే ఇప్పటికే బాలీవుడ్‌ భామలు టాలీవుడ్‌లో సందడి చేస్తున్నారు. 'కైరా అద్వానీ' చరణ్‌తో, మహేష్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకుని వెళ్లింది. తాజాగా అలియాభట్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌' కోసం టాలీవుడ్‌కి దిగుమతి అయ్యింది. ఇక ఇప్పుడు బన్నీ టైమొచ్చింది. వీలైతే అలియాభట్‌నే తన సినిమాలో హీరోయిన్‌గా బన్నీ కోరుకుంటున్నాడనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. లేకుంటే మరో కొత్త భామనైనా బాలీవుడ్‌ నుండి దించి తీరాలని బన్నీ గట్టి పట్టుమీదున్నాడనీ తెలుస్తోంది. చూడాలి మరి బన్నీ కోసం రాబోయే ఆ బాలీవుడ్‌ బ్యూటీ ఎవరో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS