సాయికుమార్ సోదరుడు బొమ్మాళీ రవిశంకర్ నటుడిగానూ, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. 'బొమ్మాళీ.. నిన్నొదలా..' అంటూ 'అరుంధతి' పాత్రలో పశుపతి పాత్రకు రవిశంకర్ ఇచ్చిన భయంకరమైన వాయిస్ ఎప్పటికీ మర్చిపోలేం. కన్నడలో విలన్ పాత్రల్లో సత్తా చాటుతోన్న రవిశంకర్ తెలుగులోనూ కొన్ని సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేశాడు.
ఎన్టీఆర్ హీరోగా నటించిన 'రామయ్యా వస్తావయ్యా' సినిమాలో రవిశంకర్ విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ రవిశంకర్ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' కోసం సింగర్‌గా మారాడు. సిరాశ్రీ రాసిన 'గర్జన.. సింహగర్జన..' అంటూ సాగే ఈ పాట లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆల్బమ్‌కే హైలైట్‌గా నిలిచేలా ఉంది. కళ్యాణీమాలిక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.
పాట రీ రికార్డింగ్ జరుగుతున్న సందర్భంగా తీసిన వీడియోలు వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పాటల రచయిత సిరాశ్రీ, సంగీత దర్శకుడు కళ్యాణీ మాలిక్, బొమ్మాళీ రవిశంకర్ ఈ వీడియోలో కనిపిస్తున్నారు. ఒకరిని మించిన కసితో ఇంకొకరు అన్నట్లుగా ఈ పాటకి ముగ్గురూ సొబగులద్దిన విధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో చెప్పడానికి ఈ పాట ఒక్కటీ సరిపోతుందేమో.
Bommali Ravi Shankar singing a thunderous song in @Jubilee10Studio for #LakshmisNTR lyrics penned by @sirasri and music by @kalyanimalik31 ..Hey @AaAaarumuga I think the power in ur voice can be heard even by NTR in heaven 🙏🙏🙏 pic.twitter.com/NQOEqtowr4
— Ram Gopal Varma (@RGVzoomin) February 11, 2019