దేవదాసు పార్వతి కన్నా, లైలా మజ్ను కన్నా గొప్ప లవ్‌స్టోరీ లక్ష్మీస్ ఎన్టీఆర్ అని తాజాగా వర్మ ట్వీటేశారు. ఎన్టీఆర్ - లక్ష్మీ పార్వతి పాత్రలతో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎన్టీఆర్‌తో లక్ష్మీ పార్వతి రొమాంటిక్ యాంగిల్‌లో ఉన్న ఫోటో ఇది. ఈ పిక్ బయటికి వచ్చాక ఇదో డీప్ లవ్‌స్టోరీ అని తెలుస్తోంది. వర్మ ట్వీట్, ఈ పిక్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
ఫిబ్రవరి 14న లవర్స్‌డే సందర్భంగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కి సంబంధించి ఓ ఇంపార్టెంట్ అప్‌డేట్ రానుందని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారమ్. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు కానీ, ఓ హింట్ అయితే ఇచ్చేశాడు వర్మ. బాలయ్య నటిస్తున్న 'మహానాయకుడు' సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఇంకా అవకతవకలు అలాగే ఉన్నాయి. ఆ సినిమా రిలీజ్ డేట్‌ని పక్కాగా అనౌన్స్ చేసిన 24 నిముషాల్లో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తానని వర్మ ప్రకటించడం విశేషం.
అంతే వర్మ ఏం చేసినా స్పెషలే కదా. ఇదిలా ఉంటే, స్వర్గీయ ఎన్టీఆర్ ఆశీస్సులు అతని కుమారుడు బాలకృష్ణకు లేవు. అందుకు నిదర్శనం 'కథానాయకుడు' ఫెయిల్యూర్ కావడమే. ఆయన పూర్తి ఆశీస్సులు భార్య అయిన లక్ష్మీపార్వతికే ఉన్నాయి.. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అని వర్మ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.