'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' ప్రీపోన్‌: అంతా ఉత్తదేనట.!

మరిన్ని వార్తలు

'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' మూవీని మార్చి 22న విడుదల చేయనున్నట్లు రామ్‌గోపాల్‌ వర్మ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ విషయంలో కొన్ని గాసిప్స్‌ చక్కర్లు కొడుతున్నాయి. 22 కన్నా ముందే 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' ప్రేక్షకుల ముందుకు రానుందని ఫిలిం వర్గాల్లో న్యూస్‌ సర్క్యులేట్‌ అవుతోంది. 

 

ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి వచ్చిన హ్యూజ్‌ రెస్పాన్స్‌తో సినిమాపై అనూహ్యమైన బజ్‌ క్రియేట్‌ అయ్యింది. దాంతో అదే జోరు కంటిన్యూ కావాలంటే ఏజ్‌ ఎర్లీ ఏజ్‌ పాజిబుల్‌ ఈ సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకురావాలని చిత్ర యూనిట్‌ యోచిస్తోందట. దాంతో అనుకున్న టైంకి వారం రోజులు ముందే అంటే మార్చి 15న 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' ని విడుదల చేయాలనుకుంటున్నారట.. అంటూ ప్రచారం జరుగుతోంది. 

 

అయితే వర్మ మాటంటే మాటే. అనుకున్న టైంకే సినిమాని రిలీజ్‌ చేస్తాడు. ప్రస్తుతం సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. వర్మ చెప్పిన డేట్‌ అనుకున్నా, అది కూడా అతి త్వరలోనే ఉండడంతో, సినిమాపై వర్మ మరింత కాన్‌సన్‌ట్రేషన్‌ చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' ప్రీపోన్‌ అని వస్తున్న గాసిప్స్‌లో నిజం ఎంత మాత్రమూ లేదని స్పష్టమవుతోంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS