రామ్ చరణ్ తాజా మూవీ 'వినయ విధేయ రామ' డిజాస్టర్ టాక్ నుండి ఫెయిల్యూర్‌గా గట్టెక్కింది. డిస్ట్రిబ్యూటర్స్‌కి 28 కోట్లు లాస్ మిగిల్చింది. దాంతో డిస్ట్రిబ్యూటర్స్‌ని ఆదుకునే పని చేపట్టాడట రామ్ చరణ్. డైరెక్టర్ బోయపాటి శ్రీను, ప్రొడ్యూసర్ డివివి దానయ్య తో కలిసి చరణ్ కొంత అమౌంట్‌ని తిరిగిచ్చేయాలనుకున్నారట. అయితే బోయపాటి సహకరించలేదనీ సమాచారమ్.
దాంతో ఆ భారాన్ని కూడా తానే భరిస్తానని చరణ్ ముందుకొచ్చాడట. ఆ క్రమంలోనే లేటెస్ట్‌గా చరణ్ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే 'వినయ విధేయ రామ' సినిమా ఫెయిల్యూర్ కావడానికి సవాలక్ష కారణాలు అంటూ ప్రచారం జరుగుతోంది. కథ బాగోలేదు. ఇంకోటీ అనేది ఓ కారణమైతే, కొన్ని కొన్ని సీన్స్ విషయంలో బోయపాటి శ్రీను కూడా సిల్లీగా ఆలోచించాడనే వార్త ఇప్పుడు బయటికి వచ్చింది.
దాంతో ఎలాంటి సీన్‌నైనా బోయపాటి కన్విన్స్ చేసేయగలడు అని ఒకానొక సందర్భంలో చరణ్ చెప్పిన సంగతిని గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. ఏది ఏమైనా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 'వినయ విధేయ రామ' ఫెయిల్యూర్ టాక్‌ని మూట కట్టుకుంది. తప్పెవరిది అనేది తేల్చలేని పరిస్థితి.? ఏది ఏమైనా ఈ గాసిప్స్‌కి తెరపడాలంటే డైరెక్టర్‌గా బోయపాటి శీను కూడా పెదవి విపాల్సిన బాధ్యత ఉందని ఆయన అభిమానులు కూడా ఆశిస్తున్నారు.