ఇటీవల 'వినయ విధేయ రామ' సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన బోయపాటి శీనుకి ఆ సినిమా రిజల్ట్ ఆశించిన విధంగా రాకపోయేసరికి ఆ తప్పంతా ఆయనదే అనే నింద మూట కట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఆ నిందను మాపుకోవాలంటే తదుపరి సినిమా విషయంలో కాస్త ఎక్కువే కాన్‌సన్‌ట్రేషన్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం బాలయ్య - బోయపాటి కాంబినేషన్‌లో సినిమా ఓకే అయ్యిందనే ప్రచారం ఉంది. ఈ సినిమాని బోయపాటి పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించనున్నాడనీ తెలుస్తోంది.
ఆ క్రమంలో స్క్రిప్టు వర్క్ చేస్తున్నాడట. ఈ సంగతి పక్కన పెడితే, బోయపాటి మరోవైపు రాజకీయంగా బిజీగా ఉన్నాడట. 2019 ఎలక్షన్స్ నిమిత్తం బోయపాటి కొన్ని కసరత్తులు చేస్తున్నారట. అంటే ఆయనేం ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనటం లేదండోయ్. చంద్రబాబు నాయుడుకీ, బోయపాటి శ్రీనుకీ మంచి స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. గతంలో టీడీపీకి సంబంధించిన పలు కార్యక్రమాల పబ్లిసిటీ వ్యవహారాల్లో బోయపాటి తనదైన శైలి ప్రదర్శించారు.
తాజాగా త్వరలో రానున్న ఎలక్షన్స్ నిమిత్తం కూడా చంద్రబాబు బోయపాటి సహకారం తీసుకున్నారనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్. బోయపాటి డైరెక్షన్‌లో తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమాలు జరగనున్నాయట. పలు కమర్షియల్ యాడ్స్ రూపొందించడంలో బోయపాటి తన పవర్‌ఫుల్ డైరెక్షన్ టాలెంట్‌ని యూజ్ చేయనున్నారనీ తెలుస్తోంది. అంటే బోయపాటికిది పొలిటికల్ డబుల్ ధమాకా అన్న మాట.