సెకండాఫ్ సెట్ట‌వ్వ‌డం లేదే..?!!

మరిన్ని వార్తలు

మ‌హా శివ‌రాత్రి రోజున‌ అల్లు అర్జున్ కొత్త సినిమాకి సంబంధించిన క‌బురేదో వ‌స్తోందంటూ... సోష‌ల్ మీడియాలో హ‌డావుడి జ‌రిగేస‌రికి అది త్రివిక్ర‌మ్ సినిమాకి సంబంధించిన విష‌య‌మే అయి ఉంటుంద‌నుకున్నారంతా. కానీ అనూహ్యంగా సుకుమార్‌తో సినిమా ప్ర‌క‌టించి షాక్ ఇచ్చాడు అల్లు అర్జున్‌. త్రివిక్ర‌మ్‌తో సినిమా ఓకే అయ్యి ఇన్ని రోజులు అయినా.. ఆ సినిమాకి సంబంధించి ఎలాంటి క‌బురూ బ‌య‌ట‌కు రాలేదు. సుకుమార్ సినిమా గురించి వార్త రాగానే.. అస‌లు త్రివిక్ర‌మ్ సినిమా ఉంటుందా, లేదా?  అనే అనుమానాలు మొద‌ల‌య్యాయి.

 

అయితే... త్రివిక్ర‌మ్ సినిమాకి ఎలాంటి ఢోకా లేదు. బ‌న్నీతో త్రివిక్ర‌మ్ సినిమా ఉంది. కాక‌పోతే... క‌థ విష‌యంలోనే త్రివిక్రమ్ ఇంకా త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతున్నాడ‌ని తెలుస్తోంది. ఫ‌స్టాఫ్ అదిరిపోయింద‌ని, సెకండాఫ్ విష‌యంలోనే తేల‌డం లేద‌ని స‌మాచారం. బ‌న్నీ కూడా ఈ సినిమా విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా అడుగులేస్తున్నాడు. 'నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా' ఫ్లాప్ త‌ర‌వాత చేయ‌బోతున్న సినిమా. 

 

ఇది కూడా అటూ ఇటూ అయితే.. త‌న స్టార్ డ‌మ్ పై ప్ర‌భావం ప‌డుతుంది. అందుకే త్రివిక్ర‌మ్‌కి కావ‌ల్సినంత టైమ్ ఇస్తున్నాడు. కాక‌పోతే ఈ సినిమా ఆల‌స్యం అవ్వ‌డం అటు అల్లు అర్జున్కీ, ఇటు త్రివిక్ర‌మ్‌కీ న‌చ్చ‌డం లేదు. వీలైనంత త్వ‌ర‌గా లాంఛ‌నంగా ఈ సినిమాని మొద‌లెట్టాల‌ని భావిస్తున్నారు. మార్చి 23న గానీ 24న‌గానీ కొబ్బ‌రికాయ కొడ‌తార‌ని, ఆ త‌ర‌వాతే.. రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లెడ‌తార‌ని టాక్‌. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS