తమ్ముడు హీరోయిన్‌పై కన్నేసిన అన్నయ్య.!

మరిన్ని వార్తలు

ఈ మధ్య హీరోయిన్లకు అన్నదమ్ములిద్దరి సినిమాల్లోనూ ఏకకాలంలో ఛాన్సులొస్తున్నాయి. మొన్న నిధి అగర్వాల్‌ అక్కినేని హీరోలతో జత కట్టిన సంగతి తెలిసిందే. తమిళంలో రకుల్‌ ఒకేసారి సూర్య, కార్తిలతో జత కట్టింది. 'జై లవకుశ'లో ఎన్టీఆర్‌తో జోడీ కట్టిన నివేదా థామస్‌ ఇప్పుడు '118' కోసం కళ్యాణ్‌రామ్‌తో జోడీ కడుతోంది. తాజాగా ఈ ఛాన్స్‌ మరో భామని వరించింది. 

 

అల్లు శిరీష్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'ఏబీసీడీ' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ముద్దుగుమ్మ రుక్సార్‌కి అల్లు అర్జున్‌తో కూడా జత కట్టే బంపర్‌ ఛాన్స్‌ దక్కిందని తెలుస్తోంది. బన్నీ - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో రుక్సార్‌ని ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ కోసం తీసుకున్నారట. అల్లు శిరీషే అన్నయ్య పక్కన రుక్సార్‌కి ఛాన్స్‌ ఇప్పించాడనీ గుసగుసలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్‌ మూవీలో ఇప్పటికే హీరోయిన్‌గా పూజా హెగ్డే పేరు దాదాపుగా కన్‌ఫామ్‌ అయ్యింది. 

 

కొత్తగా రుక్సార్‌ పేరు తెరపైకి వచ్చింది. మరో ఇద్దరు ముద్దుగుమ్మలు ఈ సినిమాలో నటించే అవకాశం ఉందనీ తాజా సమాచారమ్‌. ఆ లిస్టులోనూ పలువురు భామల పేర్లు ఇప్పటికే పరిశీలనలో ఉన్నాయి. ఫుల్‌ ప్యాక్‌డ్‌ ఫన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుందనీ తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్న ఈ ప్రాజెక్ట్‌ త్వరలోనే సెట్స్‌ పైకెళ్లనుంది. మరోవైపు అల్లు శిరీష్‌ నటించిన 'ఏబీసీడీ' చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS