బన్నీ - త్రివిక్రమ్‌ పట్టు వీడేదెప్పుడు.?

మరిన్ని వార్తలు

అదేంటీ.. బన్నీ - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ చేసేశారు కదా. క్లారిటీకి రాకపోవడమేంటని అనుకుంటున్నారా.? ఇక్కడే అసలు ట్విస్ట్‌ దాగుంది. సినిమా అనౌన్స్‌మెంట్‌ అయితే జరిగింది. కానీ పట్టాలెక్కేందుకు ఇంకా సమయం పట్టేలా ఉందట. అందుకు కారణం స్క్రిప్టు పనులే అని తెలుస్తోంది. ఈ సినిమాని పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాలని బన్నీ, త్రివిక్రమ్‌ భావిస్తున్నారు. ఆ దిశగానే త్రివిక్రమ్‌ కథ ప్రిపేర్‌ చేసే పనిలో ఉన్నారు. 

 

అయితే ఎందుకో ఇంతవరకూ రెడీ అయిన స్క్రిప్టు పై త్రివిక్రమ్‌ సంతృప్తికరంగా లేడనీ, సో మరో స్క్రిప్టు తయారు చేసే పనిలో బిజీగా ఉన్నాడనీ తెలుస్తోంది. స్క్రిప్టు సంగతిటుంచితే, ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా ఆలస్యమవుతున్నాయట. ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదట కైరా అద్వానీని అనుకున్నారు. తర్వాత పూజాహెగ్డే పేరు తెరపైకి వచ్చింది. ఇంతకీ బన్నీ సరసన చిందేసే ఆ ముద్దుగుమ్మ ఎవరనేది ఇంతవరకూ ఫైనల్‌ కాలేదు. 

 

జనవరిలోనే పట్టాలెక్కుతుందనుకున్న ఈ ప్రాజెక్ట్‌ ఇంకా ఎంత సమయం తీసుకుంటుందో తెలీదు. కానీ, మార్చిలో ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాని పట్టాలెక్కించేయాలని బన్నీ గట్టి పట్టుమీదున్నాడట. అలా అయితే మన మాటల మాంత్రికుడు తన కలానికి ఇంకాస్త తొందరగా పదును పెట్టాల్సి వుంటుంది మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS