సాలిడ్ గ్లామర్‌తో కుర్రకారుకు గిలిగింతలు పెట్టిన బ్యూటీ కేథరిన్. 'మై లవ్‌లీ ఏంజిల్..' అంటూ ఈ ముద్దుగుమ్మ అందానికి కొత్తర్ధాన్ని చెప్పేశాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అల్లు అర్జున్‌కే కాదు. అందరికీ లవ్‌లీ ఏంజిలే ఈ ముద్దుగుమ్మ. మెయిన్ హీరోయిన్‌గా కాకున్నా, హీరోయిన్‌ని దాదాపు డామినేట్ చేసే క్యారెక్టర్స్‌తో ఆకట్టుకున్న కేథరీన్‌కి తాజాగా ఓ బంపర్ ఛాన్స్ తగిలింది.
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ సినిమాలో కేథరీన్ ఛాన్స్ దక్కించుకుంది. విజయ్ దేవరకొండతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని కథానాయికలు తెగ కుతూహల పడిపోతున్నారు. విజయ్‌దేవరకొండ రేంజ్ అలా ఉంది మరి. తాజాగా ఈ యంగ్‌స్టర్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాలో ఆల్రెడీ విజయ్ దేవరకొండ సరసన ముగ్గురు భామలు స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. రాశీఖన్నా, ఐశ్వర్యారాజేష్, ఇసా బెల్లే.
ఈ ముగ్గురితో పాటు ఆ లిస్టులో కేథరీన్ పేరు కూడా యాడ్ అయ్యింది. ఆ మధ్య వరుస సినిమాలతో బిజీగా గడిపిన కేధరీన్ చిన్న బ్రేక్ తర్వాత ఇప్పుడు రాబోతోంది. అదీ సెన్సేషనల్ స్టార్‌తో అంటే ఓ సెన్సేషనల్ హిట్‌కే ప్లాన్ చేసినట్లుంది. గతంలో కేథరీన్ చిన్న క్యారెక్టరే చేసినా, ఆ క్యారెక్టర్‌కి ఎంతో ఇంపార్టెన్స్ ఉండేది. ఆ సినిమాలు కూడా దాదాపు సక్సెసఫ్‌ఫుల్ మూవీసే. ఇప్పుడు కూడా అదే సక్సెస్ మంత్ర కేథరీన్ విషయంలో రిపీట్ అవుతుందేమో చూడాలిక.