మజిలీ మూడు రోజుల కలెక్షన్స్.. చైతూ కెరీర్ లో బెస్ట్

మరిన్ని వార్తలు

హమ్మయ్య.... వరుస ఫ్లాపులకు బ్రేకు పడింది. టాలీవుడ్ కి ఎట్టకేలకు ఓ హిట్ దొరికింది. అటు నాగ చైతన్య కెరియర్ కీ ఓ బూస్టప్ వచ్చింది. నాగ చైతన్య, సమంత కలసి నటించిన మజిలీ ఈ వారం విడుదలైన సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. గోపి సుందర్ సంగీతం అందించారు. 

 

తొలి మూడు రోజులకు ప్రపంచ వ్యాప్తంగా 17 కోట్లు సాధించింది. చైతు కెరియర్ లోనే ఇది బెస్ట్. నైజాం లో 5.35 కోట్లు, సీడెడ్ లో 1.77 కోట్లు, వైజాగ్ లో 1.94 కోట్లు, అమెరికాలో 2.25 కోట్లు సాధించింది. సోమవారం చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ వచ్చే అవకాశాలు వున్నాయి. ఓవర్సేస్ లో ఈ చిత్రానికి భారీ లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. యుద్ధం శరణం, శైలజారెడ్డి అల్లుడు, సవ్యసాచి.. ఇలా వరుసగా మూడు ఫ్లాపులు కొట్టిన చైతూ.. మజిలీ సినిమాతో ఊపిరి పీల్చుకున్నట్టే. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS