తారకమ్మను ఇన్‌స్పైర్‌ చేసిన ఫోటో ఇది.!

మరిన్ని వార్తలు

ఇటీవల 'ఎన్టీఆర్‌' బయోపిక్‌లో 'బసవతారకం'గా కీలక పాత్ర పోషించి టాలీవుడ్‌కి తెరంగేట్రం చేసిన బాలీవుడ్‌ బొద్దుభామ విద్యాబాలన్‌ ఉమెన్స్‌ డే సందర్భంగా సోషల్‌ మీడియాలో ఓ ఫోటో పోస్ట్‌ చేశారు. ఊబకాయురాలైన ఓ మహిళ నగ్న చిత్రమది. ఆ ఫోటోను పోస్ట్‌ చేసి, 'మొదట నిన్ను నువ్వు ఇష్టపడడం నేర్చుకో.. నువ్వెంత గొప్పదానివో నీకు నువ్వు గుర్తించుకో..అంటూ ఆ ఫోటో గొప్పతనాన్ని వివరించింది విద్యాబాలన్‌. 

 

కెరీర్‌ స్టార్టింగ్‌ నుండీ బొద్దుగానే కనిపించింది విద్యాబాలన్‌. ఆమె బొద్దుతనంపై ఒక్కోసారి విపరీతంగా ట్రాలింగ్స్‌ కూడా జరిగాయి. విద్యాబాలన్‌ గర్భవతి అంటూ ట్రాల్‌ చేశారు అప్పట్లో కొంతమంది. బొద్దుగా ఉంటే, గర్భవతులేనా.? అని అప్పట్లో విద్యాబాలన్‌ ప్రశ్నించింది. అయినా కానీ విద్యాబాలన్‌కి అవకాశాలు మాత్రం పోటెత్తుతూనే ఉంటాయి. బొద్దుగా ఉన్నా, క్రేజీ హీరోయిన్‌గానే విద్యాబాలన్‌ చెలామణీ అవుతోంది. 

 

అయినా కానీ వీలు చిక్కినప్పుడల్లా బొద్దుతనం గురించి క్లాసులు తీసుకుంటూనే ఉంటుంది విద్యాబాలన్‌. ఆమెకు ఆ ఫోటో ఇన్‌స్పైర్‌ అయితే, ఆమె చాలా మంది లావుగా ఉన్న ముద్దుగుమ్మలకు ఇన్‌స్ప్రిరేషన్‌ అని చెప్పాలి. హీరోయిన్స్‌ అంటే నాజూకు నడుముతో కత్తిలాంటి ఫిగర్‌తో మాత్రమే ఉండాలి అనే అపోహకు విద్యాబాలన్‌ దూరం అంతే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS