ఓ నాలుగు లిప్‌కిస్‌లు, హీరోయిన్‌తో కాస్త ఘాటుగా ఎక్స్‌పోజింగ్ చేయించేస్తే సినిమా ఆడేస్తుందని చాలా మంది నమ్ముతున్నారిప్పుడు. అందుకే అలాంటి సినిమాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. వంద సినిమాలొస్తే, ఒకటో రెండో క్లిక్ అవుతున్నాయి. బడ్జెట్ తక్కువ పెడతారు కాబట్టి, ఫ్లాప్ అయిన సినిమాలకి ఆ సీన్‌ల కారణంగా డిజిటల్ వ్యూస్ వస్తాయనో, ఇంకోటనో ఓ బ్రాండింగ్ అలా ఫిక్సయిపోయింది.
అసలు విషయానికి వస్తే 'చీకటి గదిలో చితక్కొట్టుడు' అనే హారర్, సెక్సువల్ కామెడీ కలగలిసిన సినిమా ప్రేక్షకుల మీద దాడికి సిద్ధమవుతోంది. 18 ఏళ్ల లోపు పిల్లలు ఈ టీజర్‌ని చూడొద్దు అంటూ టీజర్‌ని కూడా వదిలేశారు. టీజర్‌లో భయపెట్టిందేమీ లేదు. నవ్వించిందీ లేదు. వల్గారిటీ మాత్రమే కనిపించింది. అదిత్ అరుణ్, నిక్కీ తంబోలీ, భాగ్యశ్రీ మోతే, రమేష్ కుమార్, మిర్చి హేమంత్ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. సంతోష్ దర్శకుడు.
నలుగురు కుర్రోళ్లు ఓ ఇంట్లోకి వెళితే, ఆ ఇంట్లో వారికి దెయ్యం ఎదురైతే ఆ తర్వాత ఏం జరిగింది.? అనేదే ఈ సినిమా కథ.. అంటూ మహేష్ కత్తి చెప్పడాన్ని సినిమాలో పొందుపరిచారు. మూడు రోజులు మాత్రమే ఆడే సినిమా ఇది అని తేల్చేసిన కత్తి, డిబేట్లు పెట్టి సినిమాని హిట్ చేయొద్దని చెప్పాడు. మా బూతు సినిమాకి డిబేట్లు పెట్టండహో.. ఆ బూతు చర్చలకు నన్ను పిలవండహో అన్నట్లుందీ వ్యవహారం.