తొలి షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని ఆర్‌ఆర్‌ఆర్ మళ్లీ సెకండ్ షెడ్యూల్ కోసం సెట్స్ మీదికొచ్చింది. తాజాగా సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన 'ఆర్‌ఆర్‌ఆర్' టీమ్ ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరపనున్నారట. అయితే ఈ షెడ్యూల్‌లో చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ పాల్గొంటారా.? లేక విడివిడిగానే చిత్రీకరణ జరుపుతారా.? అనేది ఇంకా క్లారిటీ లేదు.
ఇదిలా ఉంటే, ఈ మధ్య 'మిస్టర్ మజ్ను' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి స్పెషల్ గెస్ట్‌గా విచ్చేసిన ఎన్టీఆర్ గుబురు గెడ్డంతో కనిపించాడు. అస్సలు ఫిట్‌గా లేడు. అయితే ఈ సినిమాలో కొన్ని షాట్స్‌లో ఎన్టీఆర్ ఈ లుక్‌లోనే కనిపించనున్నాడన్న టాక్ కూడా ఉంది. మరోవైపు చరణ్ ఇటీవలే 'వినయ విధేయ రామ' సినిమా నుండి ఫ్రీ అయ్యి, కాస్త రిలాక్స్ అవుతున్నాడు. ఫిట్‌నెస్ పరంగా చరణ్ ఫిట్‌గానే ఉన్నాడు. సో ఈ షెడ్యూల్‌లో చరణ్‌తో షూటింగ్ పక్కా అంటున్నారు.
ఎన్టీఆర్ అయితే కొన్ని రోజుల తర్వాత జాయిన్ అవ్వనున్నాడనీ విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారమ్. తొలి షెడ్యూల్‌లో ఆల్రెడీ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ సీన్స్ చిత్రీకరణ జరిగింది. ఆ సన్నివేశాల ఔట్‌పుట్ చాలా బాగా వచ్చిందట. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ భారీ మల్టీ స్టారర్ చిత్రానికి డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.