గ్లామ్‌షాట్‌: మసాలా లుక్స్‌లో క్లాసిక్‌ బ్యూటీ.!

మరిన్ని వార్తలు

హోలీ సందర్భంగా ఫ్యాన్స్‌కి స్వీట్‌గా విషెస్‌ చెప్పింది ముద్దుగుమ్మ ప్రగ్యా జైశ్వాల్‌. హ్యాపీ హోలీ అంటూ క్యూట్‌ అండ్‌ హాట్‌గా ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చేసింది. 'సీత'గా కంచె సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తర్వాత చేసిన సినిమాలేమీ చెప్పుకోదగ్గ సక్సెస్‌ని అందించలేదు. దాంతో అవకాశాల కోసం చేయని ప్రయత్నమంటూ లేదు. కొద్ది కొద్దిగా గ్లామర్‌ కంచెలు తెంచేస్తూ సోషల్‌ మీడియాలో పిక్స్‌ పోస్ట్‌ చేస్తూ తనదైన శైలిలో హల్‌చల్‌ చేస్తోంది. అయినా కానీ లాభం ఉండట్లేదు. అమ్మడికి కావల్సింది దక్కడం లేదు. 

 

తెలుగుతో పాటు, తమిళ, హిందీ భాషల్లోనూ ప్రగ్యా ప్రయత్నాలు ఫలించడం లేదు. కానీ సోషల్‌ మీడియాలో ఫాలోవర్స్‌ని అయినా సంపాదించుకోవాలి కదా. ఆ వేలో అమ్మడు చేయాల్సినవన్నీ చేస్తోంది. తాజాగా హోలీ విషెస్‌ పేరు చెప్పి నెటిజన్స్‌కి ఫ్లయింగ్‌ కిస్‌ ఇస్తూ ఓ వీడియో పోస్ట్‌ చేసింది. ఆ సంగతి అటుంచితే, దాంతో పాటు బ్లాక్‌ హాట్‌ కాస్ట్యూమ్‌లో ఇన్నోసెంట్‌ లుక్స్‌లో ఎలా అందాలారేసేసిందో చూడండి. ఈ హాట్‌ పిక్‌ మీకోసమే. ఓ లుక్‌ ఇటేసి పండగ చేస్కోండి బాస్‌. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS