రాజుగారి కన్ను 'జెర్సీ' రీమేక్‌ పైనా పడిందండోయ్‌.!

మరిన్ని వార్తలు

ఆల్రెడీ దిల్‌రాజు 'ఎఫ్‌ 2' సినిమా హిందీ రీమేక్‌ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ లోగా తనకిష్టమైన యంగ్‌ హీరోల్లో ఒకరైన నాని నటించిన 'జెర్సీ'కి మంచి టాక్‌ రావడంతో ఈ సినిమా కూడా హిందీలో రీమేక్‌ చేయాలనే యోచనలో ఉన్నారనీ తాజా సమాచారమ్‌. బోనీకపూర్‌తో కలిసి దిల్‌రాజు 'ఎఫ్‌ 2' రీమేక్‌ చేస్తున్నారు. 'జెర్సీ' కోసం ప్రముఖ నిర్మాత కమ్‌ డైరెక్టర్‌ అయిన కరణ్‌జోహార్‌ పేరు వినిపిస్తోంది. 

 

కరణ్‌ జోహార్‌తో కలిసి దిల్‌రాజు 'జెర్సీ'ని హిందీలోకి తీసుకెళ్లాలనుకుంటున్నారట. అయితే మరోవైపు 'జెర్సీ' తెరకెక్కించిన డైరెక్టర్‌ గౌతమ్‌ తిన్ననూరి మాత్రం 'జెర్సీ'ని తాను మరోసారి రీమేక్‌ చేయలేనంటున్నాడట. గతంలో పలువురు డైరెక్టర్లు తమ సినిమాలను వేరే భాషల్లో కూడా సొంతంగా రీమేక్‌ చేసిన సందర్భాలున్నాయి. తమిళ దర్శకుడు మురగదాస్‌ 'తుపాకీ' సినిమాని హిందీలో రీమేక్‌ చేశారు. 

 

తెలుగులో 'ప్రస్థానం' సినిమాని తెరకెక్కించిన దేవకట్టానే హిందీలోనూ రీమేక్‌ చేస్తున్నారు. తాజాగా 'అర్జున్‌రెడ్డి'ని హిందీలో 'కబీర్‌సింగ్‌' పేరుతో రీమేక్‌ చేస్తున్నాడు సందీప్‌ రెడ్డి వంగా. కానీ గౌతమ్‌ తిన్ననూరి మాత్రం 'జెర్సీ'ని వేరే భాషలోకి రీమేక్‌ చేయలేనని అంటున్నారెందుకో. బహుశా 'జెర్సీ' ఎక్స్‌ప్రెషన్స్‌ వేరే భాషలో గౌతమ్‌ తిన్ననూరి ఊహించుకోలేకపోతున్నారు కాబోలు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS