నందమూరి కళ్యాణ్‌రామ్ తాజా చిత్రం '118'. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరిగింది. అయితే ఫంక్షన్ అంతా చాలా నీరసంగా జరిగింది. ఎవరిలోనూ ఉత్సాహం కనిపించలేదు. చెప్పుకోవడానికి వేదికపై నందమూరి హీరోలు ముగ్గురున్నారు. బాలయ్యతో సహా, ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ వేదికపై నిండుగా కనిపించినా, వారి మొహాల్లో ఆ నిండుతనం కనిపించలేదు.
ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ తర్వాత నందమూరి ఫ్యామిలీ నుండి వస్తున్న సినిమా ఇది. వేదికపై బాలయ్య మాటల్లో ఉత్సాహం కనిపించలేదు. స్పీచ్ చాలా తడబాటుగా అనిపించింది. ఇక బహిరంగ వేడుకల్లో తూటాల్లాంటి మాటలతో అభిమానుల్లో ఉత్సాహం నింపే ఎన్టీఆర్ కూడా ఏదో మొక్కుబడిగా మాట్లాడాడు. కానీ హార్ట్‌ఫుల్‌గా అనిపించలేదు. ఇక కళ్యాణ్‌రామ్ సంగతి చెప్పనే అక్కర్లేదు. ప్రచార చిత్రాలను ఆశక్తిగా కట్ చేసినా సినిమాపై అంతగా ఆశక్తి నెలకొనలేదు.
ఇక ఈ సినిమాకి దిల్‌రాజు మాత్రమే దిక్కు. ఆయన చేయి పడింది కాబట్టి, సినిమాపై ఓ మోస్తరు అంచనాలు నెలకొన్నాయి. ఏదేమైతేనేం దిల్‌రాజు చేతుల్లోనే ఈ సినిమా విజయ బాధ్యతను పెట్టేశారు '118' నిర్మాతలు. ఇక నీట ముంచినా, పాల ముంచినా రాజుగారే చేయాలి. గుహన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నివేదా థామస్, షాలినీ పాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు.