ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నాన్రా బాబూ..!!

మరిన్ని వార్తలు

చిరంజీవి సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశం రావ‌డం మామూలు విష‌యం కాదు. పైగా `సైరా నరసింహారెడ్డి`లాంటి భారీ బ‌డ్జెట్ సినిమా చేతికందాలంటే అదృష్టం చేసుకోవాలి. అంతేనా.. అమితాబ్ బ‌చ్చ‌న్‌, న‌య‌న‌తార లాంటి సూప‌ర్ స్టార్లున్న సినిమా ఇది. ఎవ‌రైనా స‌రే... ఎగ‌రి గంతేస్తారు. కానీ... సురేంద‌ర్ రెడ్డి ప‌రిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. చిరు 151వ చిత్రానికి సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ద‌స‌రాకి ఈ చిత్రాన్ని విడుదల చేద్దామ‌నుకుంటున్నారు. షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది. 

 

కానీ సురేంద‌ర్ రెడ్డి మాత్రం చాలా అసంతృప్తితో ఉన్నాడ‌ని టాక్‌. ఈ సినిమాకి సంబంధించి ఏ నిర్ణ‌య‌మూ సొంతంగా తీసుకోలేక‌పోతున్నాడ‌ట‌. అటు చిరంజీవి, ఇటు రామ్ చ‌ర‌ణ్‌... విప‌రీత‌మైన జోక్యం చేసుకుంటుండ‌డంతో వీరిద్ద‌రి మ‌ధ్య‌లో సూరి న‌లిగిపోతున్నాడ‌ట‌. తాను రాసుకున్న సీన్‌లో చర‌ణ్ మార్పులు చెబితే... మ‌ళ్లీ రాసుకుని తీద్దామ‌నేలోగా చిరు కూడా ఏవో మార్పులు చెబుతున్నాడ‌ట‌. అలా ఇద్ద‌రి మాటా వినాల్సివ‌స్తోంద‌ని సూరి స‌న్నిహితుల ద‌గ్గ‌ర వాపోతున్నాడ‌ట. 

 

ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నానోతెలియ‌డం లేద‌ని బాధ‌ప‌డుతున్నాడ‌ట‌. ధృవ త‌ర‌వాత సురేంద‌ర్ రెడ్డి చేస్తున్న సినిమా ఇది. ధృవ సూప‌ర్ హిట్ట‌వ్వ‌డంతో త‌న‌కు చాలా అవ‌కాశాలొచ్చాయి. అవ‌న్నీ కాద‌ని... చిరు సినిమాని ఒప్పుకున్నాడు. కానీ... ఆ సంతోషం ఆవిరైపోతోంది. `సైరా` విడుద‌లై... సూప‌ర్ హిట్ట‌యితే త‌ప్ప‌... ఈ అసంతృప్తి నుంచి సూరి బ‌య‌ట‌ప‌డేలా లేడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS