సినీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు 'కోడి రామకృష్ణ' ఇకలేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. కాలంతో పాటు మారుతూ.. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సినిమాలు తీయటంలో ప్రత్యేకతను చాటుకున్నారు. సినిమాల్లో గ్రాఫిక్స్ ఉపయోగించటంలోనూ పెద్ద పేరు సంపాదించారు.
ఆయన మొదటి సినిమా ఇంట్లో రామయ్య - వీధిలో కృష్ణయ్య. ఆ తర్వాత బాలకృష్ణ తో తీసిన సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. దాంట్లో మంగమ్మ గారి మనవడు బిగ్గెస్ట్ హిట్. కోడి రామకృష్ణ పేరు వినగానే నుదుట హెడ్ బ్యాండ్ గుర్తుకు వస్తుంది. ఎర్రటి తిలకం దిద్దుకుని.. ఆధ్యాత్మికత ముఖం పై కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
పాలకొల్లు లో జూలై 23 వ తేదీన జన్మించిన కోడి రామకృష్ణ.. సినిమాలపై ఆసక్తితో మద్రాస్ వెళ్లారు. అక్కడి నుండి హైదరాబాద్ వచ్చారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున తదితర అగ్రహీరోలతో సినిమాలు తీసి హిట్ కొట్టారు. 100 సినిమాలకు పైగా దర్శకత్వం వహించి రికార్డ్ సృష్టించారు. అరుంధతి, అమ్మోరు వంటి సినిమాలు తీసి తెలుగు సినీ స్థాయిని పెంచటంలో చురుకైన పాత్ర పోషించారు.
ఆయన అకాల మృతికి.. శాంతి చేకూరాలని www.iQlikMovies.com తరపున.. ఆయన కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము.