'మహానాయకుడు' సినిమాతో పాటు కొన్ని చిన్న సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకొచ్చాయి ఈ రోజు. అందులో మీడియా అటెన్షన్‌ని దక్కించుకున్న సినిమా '4 లెటర్స్'. పచ్చి బూతు సినిమాగా ఈ సినిమా ప్రాచుర్యంలోకి రావడానికి కారణం ట్రైలర్. అయితే ట్రైలర్‌లో చూపించింది కేవలం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి మాత్రమేనని సినిమా ద్వారా యూత్‌కి మంచి మెసేజ్ ఇస్తున్నామని దర్శకుడు రఘురాజ్ చెప్పారు.
హీరోయిన్లు తుయా చక్రవర్తి, అంకేతా మహారాణా సినిమా పబ్లిసిటీ కోసం బాగా కష్టపడ్డారు. సినిమాలో ఏమాత్రం మొహమాటపడకుండా బికినీలతో అందాలరబోసేశారు. ఇంత కష్టపడ్డా ఈ సినిమాని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. మరోపక్క రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో వచ్చిన 'మిఠాయి'కి కూడా ఓపెనింగ్స్ పెద్దగా లేవనే చెప్పాలి.
'కథానాయకుడు' రిజల్ట్ ఎలా ఉన్నా, 'ఎన్టీఆర్ మహానాయకుడు'కు మాత్రం కొంత పోజిటివ్ రెస్పాన్స్ క్రియేట్ అయ్యింది. ఓవరాల్‌గా ఈ శుక్రవారం కూడా ప్రేక్షకుల్ని అంతగా అలరించినట్లు కనిపించడం లేదనీ అప్పుడే ట్రేడ్ పండితులు పెదవి విరిచేస్తున్నారు. అయితే సాయంత్రానికి గానీ కంప్లీట్ రిజల్ట్ బయటికి రాదు. చిన్న సినిమాల్లో కంటెన్ట్ ఉంటే, కాస్త లేటుగా అయినా పుంజుకోవచ్చు.