క్రిష్‌.. నెక్ట్స్ ఏంటి??

మరిన్ని వార్తలు

క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు, మ‌ణిక‌ర్ణిక‌.. ఇలా రెండేళ్లుగా వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నాడు క్రిష్. `మ‌హానాయ‌కుడు` శుక్ర‌వారం విడుద‌ల అవుతుంది. ఆ త‌ర‌వాత క్రిష్ సినిమా ఏంట‌న్న‌ది ఓ ఫ‌జిల్‌గా మారింది. క్రిష్‌తో సినిమా చేయ‌డానికి కొంత‌మంది అగ్ర క‌థానాయ‌కులు ముందుకొచ్చార‌ని అప్ప‌ట్లో వార్త‌లొచ్చాయి. కానీ..`క‌థానాయ‌కుడు` ఫ‌లితంతో సీన్ రివ‌ర్స్ అయ్యింది. 

 

క్రిష్ మంచి ద‌ర్శ‌కుడే. కానీ క‌మ‌ర్షియ‌ల్‌గా భారీ విజ‌యాలేం లేవు. పైగా ఇప్పుడున్న అగ్ర హీరోలంతా త‌మ ప్రాజెక్టుల‌తో బిజీ అయిపోయారు. అయితే క్రిష్ కోసం బాహుబ‌లి నిర్మాత‌లు ముందుకొచ్చిన‌ట్టు స‌మాచారం. ఆర్కా మీడియా సంస్థ క్రిష్‌తో ఓ సినిమా చేయ‌బోతోంది. హీరో ఎవ‌రు? అన్న‌ది ఇంకా తేల‌లేదు. ప్ర‌స్తుతం కథా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అవి పూర్త‌య్యాకే క‌థానాయ‌కుడు ఎవ‌ర‌న్న‌ది తేలుతుంది. 

 

బాహుబ‌లి చిత్రాల‌తో దేశంలోనే అగ్ర‌గామి సంస్థ‌ల్లో ఆర్కా మీడియా ఒక‌టిగా చేరిపోయింది. మ‌రి ఈసారి ఏ హీరోపై గురి పెట్టారో చూడాలి. ఆర్కాతో కాకుండా త‌న సొంత సంస్థ అయిన ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌లో ఓ సినిమా చేయ‌డానికి క్రిష్ జాగర్లమూడి రెడీ అవుతున్నాడు. 'కంచె' స‌మ‌యంలో వ‌రుణ్‌తేజ్‌తో మ‌రో సినిమా చేయాల‌ని అనుకున్నాడు క్రిష్‌. బ‌హుశా ఆ స్క్రిప్టు ఇప్పుడు బ‌య‌ట‌కు తీస్తారేమో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS