కంగనా ఎందుకలా మాట మార్చేసిందంటే.!

మరిన్ని వార్తలు

'మణికర్ణిక' సినిమాతో ఓ రేంజ్‌లో రభస చేసి అందర్నీ గడగడలాడించిన కంగనా రనౌత్‌, ఆ వెంటనే తన బయోపిక్‌ని తెరకెక్కించబోతున్నా అంటూ మరోసారి బాలీవుడ్‌ ప్రముఖుల గుండెల్లో బాంబులు పేల్చింది. అయితే తాజాగా ఆ మాట పక్కన పెట్టేసి తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌కి ఓకే చెప్పింది. 

 

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రిగా జయలలిత చేసిన సేవలు, ఎదుర్కొన్న సవాళ్లు అన్నీ ఇన్నీ కావు.. ఈ సంగతి తెలిసిందే. అయితే హీరోయిన్‌గా బాలీవుడ్‌లో స్టార్‌ హోదాలో నిలదొక్కుకునేందుకు కంగనా కూడా చాలా చాలా కష్టాలు పడింది. కోటి ఆశలతో గ్లామర్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టే ఎంతో మంది అమ్మాయిలకు కంగనా జీవితమే ఓ గొప్ప ఆదర్శం. అలాంటి కంగనా తన జీవిత గాధను ప్రపంచానికి తెలియచెప్పే ప్రయత్నం చేయాలనుకుంది. 

 

అయితే అనుకోకుండా జయలలిత బయోపిక్‌ చర్చకొచ్చేసరికి, తన జీవితం కన్నా, జయలలిత జీవితం ఇంకా ఇన్‌స్పైరింగ్‌గా అనిపించిందనీ, అందుకే తన బయోపిక్‌ని పక్కన పెట్టేసి, జయలలిత బయోపిక్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాననీ కంగనా చెప్పుకొచ్చింది. అంతేకాదు నటన కోసం ఎంతో డెడికేటెడ్‌గా వ్యవహరించే కంగనా ఈ సినిమా కోసం తమిళం నేర్చుకుంటోందట. ఎల్‌ఎల్‌. విజయ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి విజయేంద్రప్రసాద్‌ కథ అందించారు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS