స్టన్నింగ్‌ లుక్‌లో శర్వానంద్‌.?

మరిన్ని వార్తలు

స్టార్‌ హీరోలు ఎన్టీఆర్‌, మహేష్‌బాబుల సినిమాలకు సంబంధించి షూటింగ్‌ స్పాట్‌లోని ఫోటోలు, వీడియోలు లీకైన సంగతి తెలిసిందే. ఆ లీకేజీ ఫోటోలు టాలీవుడ్‌లో కలవరం రేపాయి. అంతేకాదు, 'ఆర్‌ఆర్‌ఆర్‌' మూవీ నుండి కూడా లేటెస్ట్‌గా లీకేజీ ఫోటోలు హల్‌చల్‌ చేశాయి. ఇప్పుడు ఈ లీకేజీ సెగ శర్వానంద్‌ సినిమాకి కూడా తగిలినట్లుంది. శర్వానంద్‌ తాజా చిత్రంలోని కొన్ని ఫోటోలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. 

 

శర్వానంద్‌ ప్రస్తుతం సుధీర్‌ వర్మ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌, కళ్యాణీ ప్రియదర్శిన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా లీకైన ఫోటోల్లో శర్వానంద్‌తో పాటు కాజల్‌ అగర్వాల్‌ కూడా కనిపిస్తోంది. హీరో, హీరోయిన్ల మధ్య ఓ ఫన్నీ సన్నివేశంలా కనిపిస్తోందిది. ఈ సినిమాలో శర్వానంద్‌ రెండు డిఫరెంట్‌ వేరియేషన్స్‌ ఉన్న క్యారెక్టర్స్‌ పోషిస్తున్నాడు. వాటిలో ఒకటి డాన్‌ పాత్రనీ సమాచారమ్‌. తాజాగా లీకైన ఫోటోలు ఆ విషయాన్ని స్పష్టం చేసేలా ఉన్నాయి. 

 

గుబురు గెడ్డంతో ఓ పొడుగాటి కోట్‌ (డాన్లు ధరించేది) ధరించి కనిపిస్తున్నాడు శర్వానంద్‌. ప్రస్తుతం విదేశాల్లో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. లీకేజీ ఫోటోలే అయినా కానీ శర్వానంద్‌ లుక్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చేస్తోంది సోషల్‌ మీడియాలో. ఇదిలా ఉంటే శర్వా ఇటీవల 'పడి పడి లేచె మనసు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆశించిన రిజల్ట్‌ అందుకోలేకపోయాడు. ఇప్పుడీ తాజా సినిమాపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. దీని తర్వాత శర్వానంద్‌ '96' రీమేక్‌లో నటిస్తుంచనున్నాడు. సమంత ఈ సినిమాలో శర్వాతో జోడీ కడుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS