ప్యాంటు మీద ప్యాంటు వేసి పవన్ కళ్యాణ్ ట్రెండ్ సృష్టిస్తే, ఉన్న ప్యాంటు విప్పేసి ఇప్పుడు దిశాపటానీ ట్రెండింగ్ అయ్యింది. ఈ ముద్దుగుమ్మ కాల్విన్ క్లెయిన్ ఇన్నర్ వేర్ సంస్థకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పేరు చెప్పి దిశాపటానీ చేస్తున్న స్కిన్ షో అంతా ఇంతా కాదు, అంతేగా.. అంతేగా.. ఇన్నర్ వేర్ అంటే స్కిన్ షో చేయకపోతే ఎలా మరి. అయితే కాస్త కొత్తగా ట్రై చేసిందిప్పుడు ఈ హాట్ బ్యూటీ. టాప్‌లో ఐటెం అలానే ఉంది.
కానీ బోటమ్ని ప్రమోట్ చేయడానికి ఆల్రెడీ వేసుకున్న జీన్స్‌ని తీసి చూపిస్తోంది. బికినీ టైప్‌లో 'ఆ' టూ పీసెస్ ధరించి ఎక్స్పోజ్ చేస్తే ఫర్వాలేదు కానీ, ఇలా విప్పి చూపిస్తే, కుర్రకారుకు ఉన్నపళంగా హార్ట్ ఎటాక్స్ వచ్చేయవూ.. అదే జరుగుతోందిప్పుడు. అందుకే ఈ రెడ్ హాట్ ఇన్నర్ వేర్లో దిశా పటానీ స్టిల్స్ నెట్టింట్లో ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి. అసలే వేసవి.. ఆ తాపం చాలదన్నట్లు ఈ సొగసు కోతల గాయం మరింత ఇబ్బంది పెట్టేస్తోంది పాపం కుర్రకారుని.