కన్నడలో ఘన విజయం సాధించిన 'ఫస్ట్ ర్యాంక్ రాజు' సినిమాని తెలుగులో అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఒరిజినల్ ఫ్లేవర్ మిస్ కాకుండా తెలుగులో అదే దర్శకుడు ఈ సినిమాని రీమేక్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ లోగో, టీజర్ విడుదలైంది. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్‌గా కట్ చేసిన టీజర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. చిన్న సినిమాలంటే బూతు కంటెన్ట్ మాత్రమే హైలైట్ చేస్తున్న ఈ తరుణంలో విద్య, బుద్ది.. అనే సందేశంతో సాగే కథకు వినోదాన్ని జోడించి తెరకెక్కిస్తున్న చిత్రమిది.
కార్పొరేట్ చదువులతో విద్యార్థుల్లో విద్యా బుద్ధులు ఎంతంత మాత్రం వికసిస్తున్నాయనే కోణాన్ని బాగా చూపించారీ సినిమాలో. చేతన్ మద్దినేని ఫస్ట్‌ర్యాంక్ రాజుగా లీడ్ రోల్‌లో నటించాడు. కన్నడలో నటించిన కాషిష్ ఓహ్రా, రమ్య పసుపులేటి హీరోయిన్లుగా తెలుగులోనూ నటించారు. నరేష్ కుమార్ దర్శకుడు. శేఖర్ చంద్ర మ్యూజిక్. ప్రియదర్శి, వెన్నెల కిషోర్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. సీనియర్ నరేష్ హీరోకి తండ్రిగా కీలక పాత్రలో కనిపించారు.
కార్పొరేట్ విద్యాసంస్థలపై పంచ్ డైలాగులు బాగా పేల్చినట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. '100 పర్సంట్ విద్య, జీరో పర్సంట్ బుద్ధి' అనే క్యాప్షన్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో విద్యతో పాటు బుద్ధి కూడా ఉండాలన్న సందేశాన్నివ్వబోతున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ 'ఫస్ట్ ర్యాంక్ రాజు' తెలుగు ప్రేక్షకుల్ని ఎలా ఎంటర్‌టైన్ చేస్తుందో చూడాలి మరి.