పరిణీతి చోప్రాకిది గోల్డెన్‌ ఛాన్సే.!

మరిన్ని వార్తలు

బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌ బయోపిక్‌ నుండి ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్‌ తప్పుకున్నాక ఆ ఛాన్స్‌ పరిణీతి చోప్రాని వరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ డీల్‌ పరస్పర అంగీకారంతోనే జరిగిందని తెలుస్తోంది. ఎందుకంటే శ్రద్ధాకపూర్‌ అటు బాలీవుడ్‌లోనూ, ఇటు తెలుగులో 'సాహో' సినిమాతోనూ ఫుల్‌ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సో 'సైనా' కోసం డేట్స్‌ అడ్జస్ట్‌ కాకపోవడంతో ఈ ఛాన్స్‌ వదులుకుందట. 

 

నిజానికి 'సైనా' బయోపిక్‌ కోసం శ్రద్ధాకపూర్‌ ఎంతో కష్టపడి బ్యాడ్మింటన్‌ కూడా నేర్చుకుంది. సినిమా కోసం కాకుండా, రియల్‌ ప్లేయర్‌గా జన్యూన్‌గా బ్యాడ్మింటన్‌ నేర్చుకుంది. కానీ వరుస షెడ్యూల్స్‌ కారణంగా ఈ ఛాన్స్‌ వదులుకోవల్సి వచ్చింది శ్రద్ధాకి. ఇక ఈ ఛాన్స్‌ దక్కించుకున్న ముద్దుగుమ్మ పరిణీతి చోప్రా ఆనందానికి అవధులే లేవంట. నిజానికి శ్రద్ధాతో పోల్చితే పరిణీతి చోప్రాకి బాలీవుడ్‌లో అంత సీను లేదు. 

 

ఏదో అరా కొరా సినిమాలతో నెట్టుకొచ్చేస్తోంది. ఇటీవల తెలుగులో కూడా ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ ఉండబోతోందని వార్తలు వచ్చాయి. కానీ అదీ జరగలేదు. అనుకోకుండా వరించిన 'సైనా' బయోపిక్‌ ఛాన్స్‌తో పరిణీతి ఎగిరి గంతేస్తోందట. ఒకవేళ ఈ సినిమాతో ఆమె కోరుకున్న విజయం దక్కితే పరిణీతి కెరీర్‌ టర్న్‌ అయినట్లే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS