రాజమౌళి స్కెచ్‌ వర్కవుట్‌ అయ్యింది.!

మరిన్ని వార్తలు

రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌'కి సంబంధించి ఒక్క ప్రెస్‌ మీట్‌తో అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. అయినా ఇంకా సినిమా చుట్టూ కొన్ని గాసిస్స్‌ వినిపిస్తూనే ఉన్నాయి. గాసిప్స్‌ సంగతి పక్కన పెడితే, 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీమ్‌ తన పని తాను చేసుకుపోతోంది. ఒకవైపు సినిమా షూటింగ్‌, ఇంకోవైపు సినిమా మార్కెటింగ్‌.. రెండింటినీ రాజమౌళి పర్‌ఫెక్ట్‌గా, ప్రెస్టీజియస్‌గా ప్లాన్‌ చేస్తున్నారు రాజమౌళి. 

 

ఈ 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాని బాలీవుడ్‌లో ప్రమోట్‌ చేయడం, నిర్మాణంలో ఉండగానే హైప్‌ తీసుకురావడం కత్తి మీద సామే అయినా, అది రాజమౌళికి వెన్నతో పెట్టిన విద్య. 'బాహుబలి'ని మించి ఈ సినిమాకి హైప్‌ తీసుకురావాలన్నది రాజమౌళి ఆలోచన. దానికి ఆల్రెడీ బీజం పడింది. పని కూడా షురూ అయిపోయింది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌ ప్రకారం ఇప్పటికే పలు బాలీవుడ్‌ నిర్మాణ సంస్థలు 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీమ్‌తో సంప్రదింపులు మొదలెట్టేశారట. 

 

ఎప్పుడైతే రాజమౌళి ప్రెస్‌మీట్‌ పెట్టి, సినిమా కథ ఇది అని ప్రకటించాడో, ఆ తర్వాతి నుండీ భారీ ఆఫర్లు 'ఆర్‌ఆర్‌ఆర్‌' చుట్టూ తిరుగుతున్నాయనీ సమాచారమ్‌. రామ్‌చరణ్‌ ఆల్రెడీ బాలీవుడ్‌కి పరిచయమే. ఎన్టీఆర్‌కి మాత్రం ఇదే మొదటిసారి అవుతుంది. రాజమౌళి ఎంచుకున్న సబ్జెక్ట్‌, అతనికి దేశవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్‌ ఇవన్నీ 'ఆర్‌ఆర్‌ఆర్‌'ని ఆల్రెడీ పాన్‌ ఇండియా ఫిలింగా మార్చేశాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS