'మహర్షి' మరోసారి వాయిదా పడింది. ఏప్రిల్‌లో రావాల్సిన ఈ సినిమా మే 9కి షిఫ్ట్ అయిపోయింది. ఎవరి కారణాలు వాళ్లవి. ఈ సినిమా క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదనే కాస్త లేటుగా వస్తున్నాం అనేది దిల్‌రాజు మాట. దానికి తోడు మే నెల సెంటిమెంట్‌ని కూడా సాకుగా చూపిస్తున్నారు. 'జగదేకవీరుడు', `మహానటి`, `ఆర్య`, `భద్ర`, `పరుగు` ఇవన్నీ మే నెలలోనే విడుదలై మంచి విజయాల్ని అందుకున్నాయని, ఇప్పుడు మహర్షి సినిమా కూడా అదే సెంటిమెంట్ ని కొనసాగిస్తుందని అభిమానులకు నమ్మకంగా చెబుతున్నారు దిల్‌రాజు.
అయితే `మే` సెంటిమెంట్ మహేష్ అభిమానుల్ని భయపెడుతోంది కూడా. `బ్రహ్మోత్సవం`, `నాని` సినిమాలు మేలోనే విడుదలై అట్టర్ ఫ్లాప్స్ అయ్యాయి. బ్రహ్మోత్సవం అయితే.. మరీనూ. ఈ సినిమా సీరియల్ కంటే దారుణంగా ఉందని, మహేష్ ఎందుకు ఒప్పుకున్నాడో కూడా అర్థం కాలేదని మహేష్ ఫ్యాన్స్ వాపోయారు. అప్పుడు కూడా ఇలానే.. ఆ సినిమా వాయిదాలు పడుతూ వచ్చింది. మరి ఈ సారి ఏం జరుగుతుందో, ఏమో..??