మజిలీ దర్శకుడికి బంపర్ ఆఫర్

మరిన్ని వార్తలు

టాలీవుడ్ లో ఒక్క హిట్టు కొట్టడమే గగనం. అలాంటిది వరుసగా రెండు హిట్లు కొడితే... ఆ దర్శకుడికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. స్టార్ హీరోలు కర్చీఫ్ వేయడానికి రెడీ ఐపోతారు. బంపర్ ఆఫర్లు తగులుతుంటాయి. ప్రస్తుతం శివ నిర్వాణ పరిస్థితి ఇదే. నిన్ను కోరి, మజిలీ సినిమాలతో వరుసగా రెండు హిట్లు కొట్టేసాడు శివ. మజిలీ నిర్మాతలే మరో సినిమాకి ముందస్తుగా అడ్వాన్స్ ఇచ్చేశారు. ఇక హీరోని వెతుక్కోవడమే తరువాయి. 

 

తాజా టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ శివతో పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తున్నట్టు తెలిసింది. మంచి కథ రెడీ చేసుకో... ఇద్దరం కలసి పనిచేద్దాం అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఐతే విజయ్ ప్రస్తుతం ఫుల్ బిజీగా వున్నాడు. తన కాల్షీట్స్ దొరకడం చాలా కష్టం. కథ నచ్చినా సినిమా చేయడానికి టైం పడుతుంది. అప్పటివరకూ శివ ఆగాల్సి వస్తుంది. అన్నీ కుదిరితే 2020 జనవరిలో ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు వున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS