ఈ వారం 'అవెంజర్స్ ది ఎండ్ గేమ్' అనే హాలీవుడ్ మూవీ ధియేటర్స్‌లో సందడి చేసిన సంగతి తెలిసిందే. ప్రీ రిలీజ్‌కే ఈ సినిమా చేసిన సందడి అంతా ఇంతా కాదు. అందుకు తగ్గట్లుగానే భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. దాంతో ఇప్పటికే మంచి టాక్‌తో రన్ అవుతోన్న సమ్మర్ మూడు సినిమాల్లో 'చిత్రలహరి'ని కొన్ని ధియేటర్స్ నుండి లేపేశారు. అంతకు ముందే రిలీజైన 'మజిలీ'ని కొన్ని చోట్ల తీసేశారు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన 'జెర్సీ', 'కాంచన 3' సినిమాలు అక్కడక్కడా ఓకే అనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, 'దుప్పట్లో మిన్నాడు, 'దిక్సూచి' వంటి చిన్న సినిమాలు కూడా ఈ రోజు రిలీజయ్యాయి.
కానీ వాటి హవా ఎక్కడా కనిపించడం లేదు. సో టాలీవుడ్‌పై హాలీవుడ్ మూవీ అయిన ఈ 'అవెంజర్స్' దెబ్బ చాలా చాలా గట్టిగా తగిలిందని చెప్పక తప్పడం లేదు. ఫ్రైడే మార్నింగ్ షోస్ విషయానికి వస్తే, కొన్చి చోట్ల 'జెర్సీ' కంటే 'కాంచన 3' బెటర్‌గా ఉందని రిపోర్ట్ అందుతున్నాయి. ఇక ఫస్ట్ వీక్‌లో నాని 'జెర్సీ'తో 21 కోట్లు కొల్లగొట్టగా, 'కాంచన 3'తో లారెన్స్ 'జెర్సీ' వసూళ్లను బీట్ చేసేశాడు. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా బీసీ సెంటర్స్‌లో ఇరగదీసేసింది. అక్కడా ఇక్కడా కలిపి 'కాంచన 3' వంద కోట్లు కొల్లగొట్టేసిందనీ ట్రేడ్ వర్గాల రిపోర్ట్.