గ'మ్మత్తు' గ్లామర్‌లో 'మజిలీ' భామ.!

మరిన్ని వార్తలు

'మజిలీ' సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది ముద్దుగుమ్మ దివ్యాంశ కౌశిక్‌. మోడలింగ్‌ రంగం నుండి సినిమాల్లోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాకే గ్లామర్‌ టచ్‌ ఇచ్చేసింది. ఇంకా సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు కానీ, హాట్‌ అప్పీల్‌ మాత్రం పరిచయం చేసేసింది. ట్రైలర్‌లో చైతూతో వేడి వేడిగా లిప్‌ లాక్‌ లాగించేసింది. అసలే ఇప్పుడు లిప్‌లాక్‌ భామలకు భలే క్రేజ్‌ ఉంది. ఒకవేళ సినిమా హిట్‌ అయ్యిందా ఈ బ్యూటీకి స్పెషల్‌ క్రేజ్‌ రావడం ఖాయమే. 

 

సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్‌ సెకండ్‌ హీరోయిన్‌గా గ్లామర్‌ రోల్‌ పోషిస్తోంది. సోషల్‌ మీడియాలో తన వంతు జోరు ప్రదర్శిస్తోందీ ముద్దుగుమ్మ. తాజా పిక్‌ విషయానికి వస్తే, ఎల్లో కలర్‌ కాస్ట్యూమ్‌లో స్కిన్‌ షో, టాప్‌ లెవల్లో చేసేసింది. వేసుకున్న దుస్తుల కన్నా, ఎక్కువ పర్సంట్‌ అమ్మడి హాట్‌ హాట్‌ స్కిన్నే దర్శనమిస్తోందీ పిక్‌లో. అంతలా స్కిన్‌ షో చేస్తూనే తనకేం తెలియదంటూ, నీలాల కురుల్ని సుతారంగా సవరించుకుంటూ, స్వీట్‌గా స్మైల్‌ ఇచ్చేస్తోంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS