'కుర్‌కురే' ఈ పేరు వింటే పిల్లలకు చవులూరిపోవడం ఖాయం. పిల్లలకేంటీ.. పెద్దలకు కూడా. అంతగా ఈ స్నాక్ ఐటెం జనాల్లో విపరీతమైన ఆదరణ పొందింది. ఒకానొక టైంలో ఇందులో ప్లాస్టిక్ పార్టికల్స్ మిక్స్ అవుతున్నాయనీ, అది తింటే పిల్లల ఆరోగ్యానికి ప్రమాదమనే రూమర్స్ వచ్చాయి. కానీ అవేమీ ఈ ప్రొడక్ట్‌ని మార్కెట్‌లోంచి మాయం చేయలేకపోయాయి. పలువురు స్టార్స్ ఈ ప్రొడక్ట్‌కి బ్రాండ్ అంబాసిడర్స్‌గా వ్యవహరించారు కూడా.
గత 20 ఏళ్లుగా ఈ ప్రొడక్ట్ మార్కెట్‌లో మకుటం లేని మహారాజులా వెలుగుతోంది. తాజాగా కుర్‌కురేకి బ్రాండ్ అంబాసిడర్‌గా అక్కినేని కోడలు సమంత ఎంపికైంది. అయితే ఈ ఫుడ్ ప్రొడక్ట్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించొద్దనీ, ఆ ప్రొడక్ట్ కారణంగా చాలా మందికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయనీ, డబ్బు కోసం ప్రజల ఆరోగ్యంతో ఆటలాగే ఆలాంటి ఫుడ్ ప్రొడక్ట్స్‌కి మీరు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించి ఆ ప్రొడక్ట్ వేల్యూ మరింత పెంచొద్దనీ ఫ్యాన్స్ సమంతకు సూచిస్తున్నారట.
సమంతకు సోషల్ మీడియాలో చాలా మంది అభిమానులున్నారు. రెగ్యులర్‌గా అభిమానులతో టచ్‌లో ఉంటూ, తన పర్సనల్ విషయాలను ఎప్పటికప్పుడే షేర్ చేసుకుంటూ ఉంటుంది. అందులో భాగంగానే కుర్‌కురేకి ఎంపికైన విషయాన్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ఫోటో కూడా పోస్ట్ చేసింది సమంత అక్కినేని. సమంతను ఎంతగానో ఇష్టపడే ఫ్యాన్స్ కుర్‌కురే విషయంలో ఇలా ముందు జాగ్రత్తలు సూచించారు. మరి సమంత ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో చూడాలిక.