గ్లామ్‌షాట్‌: తడి పొడి సొగసుల్లో మసాలా ఫ్లేవర్‌.!

మరిన్ని వార్తలు

'హేట్‌ స్టోరీ 4' మూవీలో గ్లామర్‌తో కుర్రకారును పిచ్చెక్కించేసిన ముద్దుగుమ్మ ఊర్వశీ రౌతెల్లా. అందానికే పోత పోసిన శిల్పంలా ఉండే ఈ ముద్దుగుమ్మకి అవకాశాలు మాత్రం అంతంత మాత్రమే. గ్లామర్‌తో ఓ ఊపు ఊపేసినా, స్టార్‌ హీరోయిన్‌ అనిపించుకోలేకపోయింది. భాషతో సంబంధం లేకుండా సౌత్‌లోనూ అవకాశాల కోసం ట్రై చేస్తూనే ఉంది. అయితే ఎందుకో సౌత్‌ దర్శక, నిర్మాతల దృష్టి ఈ ముద్దుగుమ్మపై పడలేదు. కానీ త్వరలో తెలుగులో ఓ తెలుగు మూవీలో ఊర్వశి తన అందాలతో కనువిందు చేయనుందట. 

 

ఓ స్టార్‌ హీరో సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ కోసం ఈ అందగత్తెతో సంప్రదింపులు జరుగుతున్నాయనీ సమాచారమ్‌. ఇకపోతే సినిమా ఆఫర్ల సంగతి ఎలా ఉన్నా, అమ్మడి సోషల్‌ మీడియా సెగల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తాజా పిక్‌ చూస్తున్నారుగా, బాత్‌ రూమ్‌లో షవర్‌ కింద బేబీ పింక్‌ బికినీలో ఊర్వశి సొగసులు చూడ తరమా అన్నట్లు లేదూ. సోషల్‌ మీడియాలో ఈ ఫోటోకి పిచ్చ లైకులూ, కామెంట్లూ వచ్చేస్తున్నాయి. మరి మీ సంగతేంటీ.. నచ్చితే మీరు కూడా ఓ లైకేస్కోండి బాసూ.! 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS