నాని, ఇంద్రగంటి - 'వి' ఫర్‌ విక్టరీ.?

By Inkmantra - April 27, 2019 - 13:00 PM IST

మరిన్ని వార్తలు

'జెర్సీ'తో ప్రేక్షకుల ముందుకొచ్చిన నాని చేతిలో తదుపరి చాలా ప్రాజెక్టులు లైన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఆ లిస్టులో తన గురువుగారు ఇంద్రగంటి మోహన్‌కృష్ణతో నాని ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాని విలన్‌గా నటిస్తున్నాడంటూ ప్రచారం ఉంది. సుధీర్‌బాబు కీలక పాత్ర పోసిస్తున్న ఈ సినిమా టైటిల్‌ ఇప్పుడు చర్చనీయాంశమైంది. నిన్న మొన్నటి వరకూ ఈ సినిమాకి 'వ్యూహం' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారని టాక్‌ వినిపించింది. 

 

అయితే 'వ్యూహం' టైటిల్‌ కాదని నాని క్లారిటీ ఇచ్చేశాడు. సో తాజాగా మరో టైటిల్‌ తెరపైకి వచ్చింది. అదే 'వి'. 'వి - ఫర్‌ విక్టరీ', అనీ 'వి - ఫర్‌ విలన్‌' అనే జోరుగా ప్రచారం సాగుతోంది. మామూలుగానే ఇంద్రగంటి సినిమాలు అంచనాలకు అందవు. ఆయన సినిమాలోని కథ, కథనం, క్యారెక్టరైజేషన్‌ అన్నీ భిన్నంగా ఉంటాయి. అలాగే ఈ సినిమా కూడా ఇంతవరకూ నాని చేసిన సినిమాలన్నింట్లోకీ పూర్తి భిన్నంగా ఉండబోతోందనీ తెలుస్తోంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు చోటుంది. 

 

గతంలో తన సినిమాల్లో నటించిన ఇద్దరు ముద్దుగుమ్మలను ఈ సినిమాలో హీరోయిన్స్‌గా ఎంచుకునే ఆలోచనలో ఇంద్రగంటి ఉన్నాడనీ తెలుస్తోంది. వారెవరో కాదట 'జెంటిల్‌మెన్‌'లో నాని సరసన నటించిన నివేదా థామస్‌, 'సమ్మోహనం'లో సుధీర్‌బాబుతో జత కట్టిన అదితీరావ్‌ హైదరీ అని తెలుస్తోంది. అయితే, హీరోయిన్స్‌ విషయంలో అధికారక ప్రకటన వెల్లడి కాలేదు. కానీ, త్వరలో క్లారిటీ రానుందని తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS