'సూపర్‌' ఛాన్స్‌ కొట్టేసిన ఎన్టీఆర్‌ హీరోయిన్‌.!

మరిన్ని వార్తలు

నాని 'జెంటిల్‌మెన్‌' సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమైన మలయాళ కుట్టీ నివేదా థామస్‌. తొలి సినిమా నుండి నేచురల్‌ పర్‌ఫామెన్స్‌తో ఆకట్టుకుంటోంది. సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. 'జై లవకుశ' సినిమాలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తో జత కట్టింది. లేటెస్ట్‌గా నందమూరి హీరో కళ్యాణ్‌రామ్‌తో '118' సినిమాలో నటించింది. నివేదాకి మంచి పేరు తీసుకురావడంతో పాటు, ఈ ఏడాది హిట్‌ సినిమాల్లో వన్‌ ఆఫ్‌ ది హిట్‌ మూవీగా నిలిచింది '118'. 

 

కాగా నివేదా పేరు ఇప్పుడు సూపర్‌ స్టార్‌ సినిమా కోసం వినిపిస్తోంది. సూపర్‌ స్టార్‌ అంటే మహేష్‌బాబు అనుకునేరు. రజనీకాంత్‌. మురుగదాస్‌ - రజనీకాంత్‌ కాంబినేషన్‌లో 'దర్బార్‌' అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతార నటిస్తుండగా, హీరో కూతురి పాత్ర కోసం అంటే రజనీకాంత్‌ కూతురుగా నివేదా థామస్‌ని ఎంచుకునే యోచనలో చిత్ర యూనిట్‌ ఉందనీ తెలుస్తోంది. 

 

ఆల్రెడీ ఈ బ్యూటీ కమల్‌ హాసన్‌ తనయగా 'పాపనాశం' సినిమాలో నటించింది. తమిళ 'దృశ్యం'కు మలయాళ రీమేక్‌ ఇది. ఆ సినిమా నివేదాకి మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు సూపర్‌స్టార్‌ తనయగా ఛాన్స్‌ వచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే ఇటు హీరోయిన్‌గా తెలుగులో, మిగిలిన భాషల్లో సీనియర్‌ హీరోలకు కూతురుగా నివేదా డబుల్‌ ధమాకా పోలా.. అదిరిపోలా..!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS