గోపీచంద్ తో కాజ‌ల్‌..??

By Gowthami - April 03, 2019 - 18:30 PM IST

మరిన్ని వార్తలు

దాదాపు అగ్ర క‌థానాయ‌కులంద‌రితోనూ న‌టించింది కాజ‌ల్‌. యువ హీరోల‌తోనూ జోడీ క‌ట్టింది. కానీ గోపీచంద్ తో ఒక్క సినిమా కూడా చేయ‌లేదు. ఇప్పుడు ఆ ఆఫ‌ర్ వ‌చ్చింది. త్వ‌ర‌లోనే గోపీచంద్‌తో కాజ‌ల్ ఓ సినిమాలో న‌టించ‌నుంది. గోపీచంద్ క‌థానాయ‌కుడిగా బిను సుబ్ర‌హ్మ‌ణ్యం ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం తెర‌కెక్క‌నుంది. బివిఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మాత‌. ఈ చిత్రంలో కాజ‌ల్‌ని క‌థానాయిక‌గా ఎంచుకున్నార‌ని స‌మాచారం. ప్రేమ, వినోదం, యాక్ష‌న్ నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. క‌థానాయిక పాత్ర‌కు చాలా ప్రాధాన్యం ఉంద‌ట‌. 

 

అందుకే కాజ‌ల్‌ని ఎంచుకున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం తిరు ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న ఓ చిత్రంలో న‌టిస్తున్నాడు గోపీచంద్‌. అనిల్ సుంక‌ర నిర్మాత‌. ఇటీవ‌ల గోపీచంద్ ఈ సినిమా షూటింగ్‌లోనే గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఆ గాయాల నుంచి గోపీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే అనిల్ సుంక‌ర సినిమాని మొద‌లెడ‌తార‌ని, ఆ సినిమా పూర్త‌య్యాకే... సుబ్ర‌హ్మ‌ణ్యం సినిమాని ప‌ట్టాలెక్కిస్తార‌ని తెలుస్తోంది. ప్రస్తుతం తేజ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న‌`సీత‌`లో క‌థానాయిక‌గా న‌టిస్తోంది కాజ‌ల్. ఈ నెల‌లోనే ఈ చిత్రం విడుద‌ల కానుంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS