'ఆర్ఆర్ఆర్‌'కి ఆమె ఫిక్సయ్యిందా.?

మరిన్ని వార్తలు

రాజమౌళి ప్రతిష్ఠాత్మక చిత్రానికి హీరోయిన్‌ వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. కొమరం భీమ్‌ పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్‌ బ్రిటీష్‌ యువతితో ప్రేమలో పడతాడు. ఆ బ్రిటీష్‌ యువతి కోసం హాలీవుడ్‌ భామని ఎంచుకున్నాడు రాజమౌళి. కానీ ఆమె హ్యాండివ్వడంతో, ఆ ప్లేస్‌ని ఫిల్‌ చేసేందుకు రాజమౌళి నానా తంటాలూ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ సారి ఇక హాలీవుడ్‌ జోలికి పోకుండా, బాలీవుడ్‌తోనే సరిపెట్టాలనుకుంటున్నాడట. ఆ దిశగా బాలీవుడ్‌ భామలు శ్రద్ధాకపూర్‌, పరిణీతి చోప్రా తదితర పేర్లు తెరపైకి వచ్చాయి. 

 

కానీ వీళ్లెవరూ తన ఇమేజినేషన్‌లో ఉన్న క్యారెక్టర్‌కి సూట్‌ అవ్వకపోవడంతో, రాజమౌళి వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ దారిలోకి అనూహ్యంగా వచ్చి చేరిన మరో బాలీవుడ్‌ భామ 'జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌'. శ్రీలంక భామ కావడంతో జాక్వెలైన్‌లో బ్రిటీష్‌ ఫీచర్స్‌ ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఆమెలోని అందం, హుందాతనం రాజమౌళిని ఎట్రాక్ట్‌ చేసినట్లయితే దాదాపుగా ఆర్ఆర్ఆర్‌కి ఈ భామ ఫిక్సయినట్లే. ప్రచారమైతే జోరుగా కొనసాగుతోంది. చూడాలి మరి. 

 

ఇదిలా ఉంటే, జాక్వెలైన్‌ ప్రస్తుతం బాలీవుడ్‌లో ఓ మోస్తరు అవకాశాలతో బాగానే దూసుకెళ్తోంది. 'కిక్‌' మూవీతో సల్మాన్‌ఖాన్‌ కంపెనీ నుండి దిగుమతి అయిన ఈ అందాల భామ. ఒకవేళ రాజమౌళి ఒప్పుకుంటే, తెలుగులో 'ఆర్ఆర్ఆర్‌'తో తెరంగేట్రం చేసి, సౌత్‌ ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. మరోవైపు ఓ పక్క సినిమాలు చేస్తూనే వెబ్‌ సిరీస్‌పైనా దృష్టి పెట్టింది జాక్వెలైన్‌. 'మిసెస్‌ సీరియల్‌ కిల్లర్‌' అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది ప్రస్తుతం జాక్వెలైన్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS