జ‌గ‌న్ తాత‌య్య‌గా... జ‌గ్గూభాయ్‌

By iQlikMovies - January 03, 2019 - 13:03 PM IST

మరిన్ని వార్తలు

తెలుగు బ‌యోపిక్‌ల‌ ప‌రంప‌ర‌లో భాగంగా తెర‌కెక్కుతున్న చిత్రం `యాత్ర‌`. దివంగ‌త ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.ఆర్ జీవిత క‌థ‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మ‌రీ ముఖ్యంగా ఆయ‌న పాద యాత్ర‌లో ఎదురైన సంఘ‌ట‌న‌లు, స‌న్నివేశాల‌లు ఈ చిత్రంలో ప్ర‌ధానంగా క‌నిపించ‌నున్నాయి. 

 

వై.ఎస్‌.ఆర్ పాత్ర‌లో మ‌మ్ముట్టి న‌టిస్తున్నారు. ఆయ‌న త‌ప్ప‌.. ఈ చిత్రానికి స్టార్ బ‌లం లేదు. అయితే ఇప్పుడు జ‌గ‌ప‌తిబాబు కూడా ఈ సినిమాలో ఎంట్రీ ఇచ్చేశాడు. వై.ఎస్‌.ఆర్ తండ్రి రాజా రెడ్డి పాత్ర‌లో జ‌గ్గూభాయ్ క‌నిపించ‌నున్నాడు. అంటే.. జ‌గ‌న్‌కి తాత‌య్య అన్న‌మాట‌. గురువారం జ‌గ‌ప‌తిబాబు లుక్‌ని విడుద‌ల చేశారు.

 

ఆ పాత్ర‌లో.. జ‌గ్గూ మ‌హా బాగా సూటైన‌ట్టే క‌నిపిస్తున్నాడు. మ‌హి వి.రాఘ‌వ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 8న విడుద‌ల చేయ‌డానికి చిత్ర‌బృందం స‌న్నాహాలు చేస్తోంది. స‌రిగ్గా అప్పుడే ఎన్టీఆర్ `మ‌హానాయ‌కుడు` కూడా వ‌స్తోంది. అంటే రెండు బ‌యోపిక్‌ల‌నూ ఒకేసారి చూడొచ్చ‌న్న‌మాట‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS