Janhvi: ఎన్టీఆర్ అంటే ఇంత ప్రేమ ఉందా జాన్వీ...?

మరిన్ని వార్తలు

జాన్వీ క‌పూర్‌.... ఈ పేరు మంత్రంలా జ‌పిస్తుంటుంది యువ‌త‌రం. తెలుగులో శ్రీ‌దేవి త‌న‌య ఒక్క సినిమా కూడా చేయ‌లేదు. కాక‌పోతే.. శ్రీ‌దేవి కూతురిగా ఇక్క‌డ త‌న‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగులో జాన్వీ ఎప్పుడు న‌టిస్తుందా? అని అంతా ఆశ‌గా ఎదురు చూశారు. ఎట్టకేల‌కు ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ ద‌క్కించుకొంది. ఇది వ‌ర‌కు కూడా జాన్వీకి చాలా ఆవ‌కాశాలే వ‌చ్చాయి. కానీ.. త‌ను ఒప్పుకోలేదు. ఎన్టీఆర్ సినిమా అన‌గానే ఎగిరి గంతేసింది. ఎందుకంటే త‌న‌కు ఎన్టీఆర్ అంటే అంతిష్టం. అందుకే ఇది వ‌ర‌కు ఎన్ని అవ‌కాశాలు వ‌చ్చిన `నో` చెప్పిన జాన్వీ ఎన్టీఆర్‌కి ప‌డిపోయింది.

 

ఎన్టీఆర్‌పై త‌న‌కున్న ప్రేమ‌ని జాన్వీ మ‌రోసారి వ్య‌క్త ప‌రిచింది. ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ రాగానే మ‌రే విష‌యం ఆలోచించ‌లేద‌ని, వెంట‌నే ఒప్పేసుకొన్నాన‌ని.. ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది జాన్వీ. అంతే కాదు.. ఈ అవ‌కాశం చేజారిపోకూడ‌ద‌ని భ‌గ‌వంతుడ్ని రోజూ ప్రార్థించేద‌ట‌. ఈ సినిమా ఎప్పుడు మొద‌లెడ‌తారు? అంటూ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌కు రోజూ మెసేజులు పెడుతోంద‌ట‌. ఈ విష‌యాల‌న్నీ తానే చెప్పింది. ఎన్టీఆర్ కోస‌మే ఆర్‌.ఆర్‌.ఆర్ రెండు సార్లు చూశాన‌ని, అందులో ఎన్టీఆర్ న‌ట‌న‌, అందం అద్భుత‌మ‌ని కొనియాడింది. ఎన్టీఆర్ స్థాయి వేర‌ని, దాన్ని వేరే వాళ్లు అందుకోలేర‌ని కితాబు ఇచ్చింది జాన్వీ. త‌న మాట‌ల‌కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు పొంగిపోతున్నారు. మా ఎన్టీఆర్ పై అంత ప్రేమ ఉందా జాన్వీ..? అంటూ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక వీరిద్ద‌రూ తెర‌పై క‌నిపిస్తే అభిమానుల‌కు పండ‌గే. ఆ రోజు తొంద‌ర్లోనే రానుంది. ఈ వారంలోనే ఈ సినిమాకి కొబ్బ‌రి కాయ కొట్ట‌బోతున్నారు. ఆ కార్య‌క్ర‌మానికి జాన్వీ కూడా రాబోతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS