అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ హీరోయిన్‌గా తెరంగేట్రం చేస్తుందట అనే న్యూస్ బయటికి వచ్చిందో అప్పటి నుండి ఏదో ఒక రకంగా ఆమె వార్తల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. తర్వాత కూతురు డెబ్యూ మూవీ చూడకుండానే శ్రీదేవి మరణం.. ఆ వెంటనే 'ధడక్' (జాన్వీ తొలి చిత్రం) విడుదల కావడం మంచి విజయం సాధించడం తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడం అన్నీ ఫాస్ట్ ఫాస్ట్‌గా నడిచిపోయాయ్.
ఇప్పుడయితే జాన్వీ వరుస ఆఫర్లతో ఫుల్ జోష్ మీదుంది. ఈ సంగతిటుంచితే, మామూలుగానే స్టార్ కిడ్స్‌పై కూసింత ఫోకస్ ఎక్కువ మీడియాకి. జాన్వీ కపూర్ మీద అది ఇంకాస్త ఎక్కువే. ఆమె ఎ్కడికి వెళ్లినా, ఏం చేసినా మీడియా కన్ను ఆమెని ఓ కంట కనిపెడుతూనే ఉంటుంది. ఒక్కోసారి ఆ కనిపెట్టడంలో విసుగు కూడా తెప్పిస్తుంటుంది. అది వేరే సంగతిలెండి. అయినా కానీ సెలబ్రిటీలు విసిగిపోకూడదు కదా. కూల్‌గానే కనిపించాలి.
ఇక ఎప్పటిలాగే జాన్వీ కపూర్ జిమ్‌కెళుతుంటే కెమెరా తనను వెంటాడింది. రోజూ జరిగే తంతే అయినా, ఈ సారి జాన్వీ కాస్త డిఫరెంట్‌గా స్పందించింది. మీ కెమెరా కోసమే నేను ఇలాంటి బట్టలు వేసుకుంటాను.. అని ఫన్నీ కామెంట్ చేసింది. డెబ్యూ మూవీలో జాన్వీ ట్రెడిషనల్‌గా కనిపించినా, బహిరంగంగా ఎప్పుడు కనిపించినా చాలా హాట్ దుస్తుల్లో దర్శనమిస్తుంది. ఈ సంగతి అందరికీ తెలిసిందే. దానికే తనపై తానే కౌంటర్ వేసేసుకుందిలా జాన్వీ కపూర్.