'గీత గోవిందం' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసి, 'నోటా'పై భారీగా అంచనాలు క్రియేట్ చేసేసి రిలీజ్ తర్వాత భారీగా నిరాశ పరిచినా తర్వాత లీకేజీ మూవీ 'ట్యాక్సీవాలా'తో సూపర్ హిట్ కొట్టేయడం విజయ్ దేవరకొండకు మాత్రమే చెల్లింది. ఈ రైజింగ్ స్టార్ ఇప్పుడు 'డియర్ కామ్రేడ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దాదాపు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇక రిలీజ్ డేట్ కోసం వెయిటింగ్‌లో ఉంది.
అయితే ఈ సినిమాని మే 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ ఓ నిర్ణయానికి వచ్చిందట. అదే డేట్‌ని విజయ్ దేవరకొండ కూడా సూచిస్తున్నాడట. విజయ్‌దేవరకొండకు యూత్‌లో ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే కదా. ఆ టైం అయితే బాగా వర్కవుటవుతుందనీ విజయ్ దేవరకొండ భావిస్తున్నాడట. ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి, సమ్మర్ హాలీడేస్‌ని ఎంజాయ్ చేసే మూడ్ అది. ఆ మూడ్‌ని తన సినిమాకి సక్సెస్ మోడ్‌గా మార్చేసుకోవాలన్నదే విజయ్ దేవరకొండ ప్లాన్.
అన్నట్లు ఈ సినిమాలో విజయ్‌ది స్టూడెంట్ లీడర్ పాత్ర కావడం ఈ సీజన్‌కి యాప్ట్ కానుంది. గమనించాల్సిన మరో ముఖ్య విషయమేంటంటే ఇంతవరకూ తెలంగాణా కుర్రోడిలా మెప్పించిన విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం అచ్చతెలుగు ఆంధ్రా కుర్రోడి అవతారమెత్తేశాడు. సినిమాలో ఎక్కువ భాగం కాకినాడ పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించారు. భరత్ కమ్మ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం అవుతుండగా, రష్మికా మండన్నా విజయ్‌తో జోడీ కడుతోంది.