మహేష్ బాబు 'మహర్షి' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. మహర్షి తరువాత మహేష్ బాబు 26వ సినిమా ఎవరితో అనే విషయం తెలుగు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల సుకుమార్ తో అనుకున్న సినిమా కాస్త అనిల్ రావిపూడి చేతుల్లోకి వచ్చింది.
ప్రస్తుతం, అనిల్ రావిపూడి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. నటీనటుల ఎంపిక విషయంలో భాగంగా ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్ర కోసం ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్రతో సంప్రదింపులు జరిగాయట. అయితే, ఉపేంద్ర మాత్రం ఈ ఆఫర్ ని తిరస్కరించినట్టు సమాచారం. డేట్స్ కుదరక పోవటం వల్ల మహేష్ బాబు సినిమా ఆఫర్ వదులుకున్నారట ఉపేంద్ర.
దాంతో.. కన్నడ హీరో ఉపేంద్ర టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఆఫర్ తిరస్కరించారని, అందుకు సారీ కూడా చెప్పారని వార్తలు వస్తున్నాయి. కానీ, అవన్నీ రూమర్స్ అంటూ ఉపేంద్ర లేటెస్టుగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 'ఆ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు కాల్ షీట్స్ లేక చేయలేనని చెప్పాను.. కానీ ఒకసారి స్టోరీ విని నా నిర్ణయం చెప్పమన్నారు. అప్పటినుండి ఇప్పటివరకు ఆ సినిమా ప్రస్తావన నా దగ్గర రాలేదు" అని చెప్పారు ఉపేంద్ర.