కేజీఎఫ్ తో సంచలనం సృష్టించాడు యష్. ఆ సినిమా దాదాపు 250 కోట్లు వసూలు చేసి దేశం మొత్తాన్ని నివ్వెర పరిచింది. ఓ కన్నడ చిత్రం ఈ స్థాయిలో వసూళ్లు తెచ్చుకోవడం ఇదే ప్రధమం. దాంతో యష్ పేరు మార్మోగిపోతోంది. ఈ హీరోని తెలుగు నాట తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయని టాక్.
`ఆర్.ఆర్.ఆర్`లో యష్ ప్రతినాయకుడిగా కనిపిస్తాడని ప్రచారం జరిగింది. అయితే అందులో నిజం లేదని తేలిపోయింది. యష్ ఎంట్రీ హీరోగానే ఉండబోతోందని టాక్. ఓ ప్రముఖ నిర్మాత యష్ ని సంప్రదించిందని, తెలుగులో వరుసగా అతనితో రెండు సినిమాలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకోనున్నదని టాక్. అయితే యష్ భారీ స్థాయిలో కండీషన్లు పెడుతున్నాడట.
అగ్ర దర్శకుడితోనే పనిచేస్తానని, తనకు కావల్సిన టెక్నీషియన్లు టీమ్‌లో ఉండాలని, పారితోషికం విషయంలోనూ తగ్గేది లేదని - షరతులు విధిస్తున్నాడట. యష్‌తో చేయడానికి దర్శకులు సిద్ధంగానే ఉన్నా.. ప్రస్తుతం అగ్ర దర్శకులంతా ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యష్ కోరిక నెరవేరడం కష్టం. తన కండీషన్లను సడలిస్తే... త్వరలోనే యష్ తెలుగులో అరంగేట్రం చేయడం ఖాయం.