విజయ్‌దేవరకొండ నటించిన 'అర్జున్‌రెడ్డి' సినిమాని హిందీలో 'కబీర్‌సింగ్'గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. టీజర్ చూస్తే సినిమా మక్కీకి మక్కీ తెలుగు 'అర్జున్‌రెడ్డి'లాగే కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ పాత్రలో షాహిద్ కపూర్ నటించాడు. హీరోయిన్‌గా కియారా అద్వానీ నటించింది. జూన్ 21న 'కబీర్‌సింగ్' ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తెలుగు 'అర్జున్‌రెడ్డి' తొలి పోస్టర్‌తోనే సంచలనంగా మారింది.
ఆ తర్వాత బోలెడన్ని సంచలనాలకు వేదికైంది. అందుకు కారణం సినిమాలోని లిప్‌లాక్ సీన్స్. అయితే హిందీ రీమేక్‌లో ముద్దు సీన్లు లేవా.? అంటే టీజర్‌లో బుగ్గ మీద ముద్దునే చూపించారు. కానీ సినిమాలో లిప్‌లాక్స్ లేకపోవడం అసంభవం. అసలు అర్జున్‌రెడ్డికి అంత ఫేమ్ రావడానికి కారణమే ఆ ముద్దుసీన్లు. ముద్దులంటే హద్దులున్న టాలీవుడ్‌లోనే ఆ ముద్దు సీన్లను అంత విచ్చలవిడిగా తెరకెక్కించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, అసలు హద్దులే లేని బాలీవుడ్‌లో వాటినింకెంత బీభత్సం చేసేసి ఉంటాడో కదా.
అయితే ఎందుకో టీజర్‌లో హీరో ఆటిట్యూడ్‌నీ, కొన్ని యాక్షన్ సన్నివేశాల్ని మాత్రమే చూపించాడు. ముందు ముందు విడుదల కాబోయే పోస్టర్స్‌పై అసలు సినిమా రివీల్ చేస్తాడేమో చూడాలి మరి. మొత్తానికి హీరో షాహిద్‌కపూర్ అచ్చం విజయ్ దేవరకొండని మ్యాచ్ చేసేశాడు. రిజల్ట్‌లో మ్యాచ్ చేస్తాడో లేదో చూడాలి. ఇకపోతే 'అర్జున్‌రెడ్డి' తమిళంలోనూ రీమేక్ అవుతోన్న సంగతి తెలిసిందే. విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాని 'ఆదిత్య వర్మ' అనే టైటిల్‌తో రూపొందిస్తున్నారు.