'సైరా' మనసారా: సుదీప్‌ హార్ట్‌ టచ్చింగ్‌ ట్వీట్‌.!

మరిన్ని వార్తలు

శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న చిరంజీవి 151వ చిత్రం 'సైరా'లో కన్నడ నటుడు సుదీప్‌ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సుదీప్‌ ఈ సినిమాతో తనకున్న అనుబంధాన్ని హార్ట్‌ టచ్చింగ్‌గా ఓ మెసేజ్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

 

'ఈ సినిమాకి సురేందర్‌ రెడ్డి ప్రాణం పెట్టేశాడు. 'సైరా'లో నా పాత్రకు సంబంధించి లాస్ట్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ జరుగుతోంది. ఈ సందర్భంగా చాలా మధురానుభూతుల్ని తీసుకెళ్లున్నాను 'సైరా' సెట్స్‌ నుండి.. అత్యద్భుతమైన టెక్నీషియన్లు ఈ సినిమాకి పని చేశారు. స్టార్‌ కాస్టింగ్‌ పరంగా చాలా అద్భుతమైన సినిమా అవుతుంది 'సైరా'. ఇంత గొప్ప సినిమాలో నాకు అవకాశం రావడం నా అదృష్టం.. పాన్‌ ఇండియా సినిమా 'సైరా'..' అంటూ సుదీప్‌ ట్వీట్‌ చేశాడు.

 

ఈ సినిమాలో సుదీప్‌ 'అవుకు రాజు' పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాత్ర ప్రాధాన్యత ఏంటనేది తెలియదు కానీ, ఈ సినిమాలోని ప్రతీ పాత్ర ప్రాధాన్యత సంతరించుకున్నదే. సుదీప్‌తో పాటు, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, తమన్నా, విజయ సేతుపతి, నిహారిక తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ సినిమాలో. కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో రూపొందుతోన్న రెండవ చిత్రమిది. భారీ బడ్జెట్‌తో రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS