చందమామకు పోటీ కొరియన్‌ బ్యూటీ.!

By iQlikMovies - January 11, 2019 - 13:30 PM IST

మరిన్ని వార్తలు

కమల్‌ హాసన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న 'ఇండియన్‌ 2' చిత్రానికి మరో హీరోయిన్‌ని ఎంపిక చేసే పనిలో ఉంది చిత్ర యూనిట్‌. ఆల్రెడీ ఈ సినిమా కోసం చందమామ కాజల్‌ అగర్వాల్‌ని ఎంచుకున్న సంగతి తెలిసిందే. మరో హీరోయిన్‌గా బాలీవుడ్‌ బ్యూటీని దించనున్నారని వార్తలు వెలువడ్డాయి. అయితే బాలీవుడ్‌ కాదు, కొరియన్‌ బ్యూటీ అంటూ తాజాగా ప్రచారం జరుగుతోంది. బేసుజీ అనే కొరియన్‌ భామను ఈ సినిమా కోసం సౌత్‌కి దిగుమతి చేసే పనిలో శంకర్‌ అండ్‌ టీమ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. 

 

బేసుజీ నటి మాత్రమే కాదు, గాయని కూడా. అంతేకాదు, చాలా చాలా అందగత్తె కూడా. అందుకే అందాల చందమామకి ఈ కొరియన్‌ బ్యూటీ గట్టి పోటీనే అయ్యేలా ఉంది. పెద్దగా సినిమాలు చేసిన అనుభవం లేకున్నా, అమ్మడిది డిఫరెంట్‌ అప్పీల్‌. ఇంతవరకూ నాలుగు సినిమాల్లోనే నటించింది. అయితే యాక్టింగ్‌ స్కిల్స్‌లో సత్తా చూపించగల చతురత ఉన్న ఈ ముద్దుగుమ్మని పర్టిక్యులర్‌గా యాక్షన్‌ సీన్స్‌ కోసమే తీసుకోనున్నారట. ఈ బ్యూటీతో అదిరిపోయే యాక్షన్‌ సీన్స్‌ని తెరకెక్కించనున్నారట. 

 

అలా అని గ్లామర్‌ మిస్సవ్వదు కదా శంకర్‌ సినిమాల్లో. సో చందమామకు సుజీ గట్టి పోటీ అనడం నిస్సందేహమే. ఈ సినిమాలో కమల్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. సీనియర్‌ కమల్‌కి కూడా హీరోయిన్‌ వెతికే పనిలో ఉన్నారు. గతంలో వచ్చిన 'ఇండియన్‌' మూవీలో సీనియర్‌ కమల్‌కి జోడీగా సుకన్య నటించింది. ఈ నెల 18 నుండి 'ఇండియన్‌ 2' రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ ఏడాది సమ్మర్‌లోనే 'ఇండియన్‌ 2'ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే యోచనలో శంకర్‌ ఉన్నారట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS