కమల్‌ పార్టీలో చేరిన కోవై సరళ.!

మరిన్ని వార్తలు

లేడీ కమెడియన్‌గా తెలుగు, తమిళ తదితర భాషల్లో సుపరిచితురాలు కోవై సరళ. హాస్య బ్రహ్మ బ్రహ్మానందంతో కోవై సరళ కాంబినేషన్‌ స్క్రీన్‌పై కనిపించిందంటే రచ్చో రచ్చహ రచ్చోభ్యహ.. ఈ మధ్య కోవై సరళ హవా కాస్త తగ్గింది. అప్పుడప్పుడూ సినిమాల్లో కనిపిస్తుందంతే. అయితే ప్రస్తుతం కోవై సరళ రాజకీయ రంగప్రవేశం చేస్తునట్లు సమాచారమ్‌ అందింది. 

 

తాజాగా అందిన సమాచారమ్‌ ప్రకారం కమల్‌ హాసన్‌ పార్టీ మక్కల్‌ మీది మయ్యం పార్టీలో చేరారు కోవై సరళ. త్వరలో జరగబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మక్కల్‌ మీది మయ్యం పార్టీ సన్నాయత్తమవుతోంది. ఈ ఎన్నికల్లో పార్టీ తరపు నుండి కోవై సరళ కూడా పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గతంలో కోవై సరళ, కమల్‌హాసన్‌ జంటగా 'సతీ లీలావతి' సినిమాలో నటించారు. 

 

అప్పట్లో అదో సెన్సేషన్‌. ఈ సినిమాకి కమల్‌ నిర్మాతగా వ్యవహరించారు కూడా. నిర్మాత అయ్యుండి కోవై సరళను హీరోయిన్‌గా ఎంచుకోవడం అప్పట్లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించడంతో పాటు, కోవై సరళకు నటిగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత సల్మాన్‌ ఖాన్‌ హీరోగా బాలీవుడ్‌లో రీమేక్‌ అయ్యింది కూడా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS