'1 - నేనొక్కడినే' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ కృతిసనన్. సూపర్ స్టార్‌తో సూపర్‌గా ఎంట్రీ ఇచ్చినా బోణీ కలిసి రాలేదు. తర్వాత అక్కినేని బుల్లోడు నాగచైతన్యకు జోడీగా 'దోచేయ్' సినిమాలో కనిపించింది. ఆ సినిమా కూడా అంతంత మాత్రమే కావడంతో, టాలీవుడ్‌కి బైబై చెప్పేసి బాలీవుడ్‌కి చెక్కేసింది.
రీసెంట్గా బాలీవుడ్లో కృతిసనన్ నటించిన 'లుక్కా చుప్పీ'తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాతో మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం భారీ బడ్జెట్ మూవీ 'కళంక్'లో నటిస్తోంది. ఇక సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ హాట్ హాట్ పిక్స్‌లో తన అందాలను ఎరగా వేస్తుండడం ఈ ముద్దుగుమ్మకీ అలవాటే.
అందులో భాగంగా తాజా పిక్‌ని పోస్ట్ చేసింది కృతి సనన్. బ్రైట్ బ్లూ కట్స్ బికినీలో స్విమ్మింగ్ పూల్ పక్కన కూర్చొని హాట్ హాట్ అందాలతో కవ్విస్తోంది. అందం చూడవయా ఆనందించవయా.. అని చూసి మీరూ తరించండయా.!